Health Tips : హ్యాండ్ డ్రైయర్లు సురక్షితమేనా? బ్యాక్టీరియాకు నిలయమా?

by Javid Pasha |   (  Updated:2026-04-13 11:02:21  IST  )

ఎయిర్ హ్యాండ్ డ్రైయర్లు చేతులను ఆరబెడతాయనుకుంటారు చాలామంది. కానీ.. అవి బ్యాక్టీరియా తిరిగి చేతులపై పడేందుకు కారణం అవుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Health Tips : హ్యాండ్ డ్రైయర్లు సురక్షితమేనా? బ్యాక్టీరియాకు నిలయమా?
X

దిశ, ఫీచర్స్ : బయటకు వెళ్లినప్పుడో, జర్నీ మధ్యలోనో ఎక్కడో ఒక దగ్గర ఎయిర్ హ్యాండ్ డ్రైయర్లు వాడాల్సి వస్తుంది చాలామందికి. ముఖ్యంగా సినిమా థియేటర్లలో, రైల్వే స్టేషన్లలో, పెద్ద పెద్ద హోటళ్లలోని వాష్ రూముల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. చేతుల కడుక్కున్నాక తడి ఆరడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని వాడటం అంత సురక్షితం కాదని మీకు తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్& క్విన్నిపియాక్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఇదే తేలింది. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్లలోని హాట్ ఎయిర్ హ్యాండ్ డ్రైయర్ల(air hand dryer) గురించి ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. అవేమిటో చూద్దామా!

ఎక్కడ పెరుగుతుంది?

డ్రైయర్లు మన చేతులను ఆరబెడతాయనుకుంటాం. కానీ అవి బ్యాక్టీరియాను చేతులపై పడేస్తాయని నిపుణులు గుర్తించారు. స్టడీలో భాగంగా శాస్త్రవేత్తలు పెట్రి డిష్‌లను (బ్యాక్టీరియా పెరగడానికి ఉపయోగపడే ప్లేట్లు) టాయిలెట్ గాలికి బహిర్గతం చేసి పరీక్షించారు. కాగా డ్రైయర్ ఆఫ్‌లో ఉన్నప్పుడు 2 నిమిషాలు గాలికి బహిర్గతం చేసినప్పుడు పెట్రి డిష్‌లలో అస్సలు బ్యాక్టీరియా పెరగలేదు. కానీ డ్రైయర్ ఆన్ చేసి 30 సెకన్లు హాట్ ఎయిర్‌కు బహిర్గతం చేస్తే, ఒక్కో డిష్‌లో 18 నుంచి 60 కాలనీలు (కొన్ని సందర్భాల్లో 254 వరకు) బ్యాక్టీరియాలు పెరిగాయి. ఈ బ్యాక్టీరియా డ్రైయర్ లోపలే పెరుగుతుందా లేదా టాయిలెట్ గాలి నుంచి లోపలికి లాగబడుతుందా అని తెలుసుకోవడానికి వారు HEPA ఫిల్టర్లు అమర్చి మళ్లీ పరీక్షించారు. అయితే ఇలా చేసిన తర్వాత బ్యాక్టీరియా మొత్తం 75% తగ్గింది. డ్రైయర్ నాజిల్‌పై కూడా చాలా తక్కువ బ్యాక్టీరియా మాత్రమే ఉంది. దీని ద్వారా చాలా బ్యాక్టీరియా టాయిలెట్ గాలి నుంచి డ్రైయర్ లోపలికి లాగబడి, తడి చేతుల మీద పడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఇందులో మానవులకు వ్యాధులు కలిగించే బ్యాక్టీరియా, అలాగే స్పోర్స్ కూడా ఉంటున్నాయని గుర్తించారు.

ఎలా వస్తుంది?

డ్రైయర్‌లోకి లేదా గాలిలోకి హానికరమైన బ్యాక్టీరియా మొదట ఎలా వస్తుంది? అంటే లిడ్ లేని టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు ఒక చిన్న ఫీకల్ మిస్ట్ (Fecal microbe snow) గాలిలోకి వ్యాపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ మిస్ట్ 6 చదరపు మీటర్ల వరకు వ్యాపించవచ్చు. హాస్పిటల్స్‌లో ఇలాంటి ఏరోసాల్స్ Clostridium difficile వంటి ప్రమాదకర బ్యాక్టీరియాను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఫైనల్లీ ఈ అధ్యయనం హ్యాండ్ డ్రైయర్ల కంటే.. పేపర్ టవల్స్ మంచివని సూచిస్తూ, పబ్లిక్ రెస్ట్‌రూమ్ హైజీన్ గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.

అమ్మాయిలు వెయిట్ లాస్ కావడం చాలా కష్టం.. ఎందుకంటే..

Next Story