అమ్మాయిలు వెయిట్ లాస్ కావడం చాలా కష్టం.. ఎందుకంటే..

by Sujitha Rachapalli |

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు వెయిట్ లాస్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. పురుషులు త్వరగా బరువు నియంత్రణలో ఉంచినా.. స్త్రీలు మాత్రం కష్టపడుతుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.

అమ్మాయిలు వెయిట్ లాస్ కావడం చాలా కష్టం.. ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా అబ్బాయిలోపాటు అమ్మాయిలు జిమ్‌కు వెళ్లడం చూస్తుంటాం. కానీ వీరిలో అబ్బాయిలు వెయిట్ మేనేజ్మెంట్ చేసే తీరు.. అమ్మాయిలతో భిన్నంగా ఉంటుంది. చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే ఫిట్‌గా ఉంటారు. బరువు తగ్గుతారు. కారణం హార్మోన్ల మార్పులు, జీవన దశలు, మెటబాలిక్ కారకాలు అని చెప్తున్నారు నిపుణలు. ప్యూబర్టీ, గర్భం, మెనోపాజ్.. ఈ ఫేజ్‌లు మహిళల మెటబాలిజం, శరీర కూర్పుపై ప్రభావం చూపుతుంటాయి. అనేక జీవసంబంధిత మార్పులకు కారణమవుతాయి.

నిపుణుల ప్రకారం.. బరువు కేవలం స్కేల్‌పై ఒక సంఖ్య మాత్రమే కాదు.. అది హార్మోన్ల సమతుల్యత, సంతానోత్పత్తి, డయాబెటిస్ ప్రమాదం, దీర్ఘకాలిక గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మహిళల బరువు తగ్గుదల ప్రయాణాలకు త్వరిత పరిష్కారాల కంటే నిర్మాణాత్మక, వైద్యపరంగా మార్గదర్శకత్వం అవసరం. భారతీయ మహిళల్లో ఊబకాయం పబ్లిక్ హెల్త్ సమస్యగా మారింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) డేటా ప్రకారం.. దాదాపు 24 శాతం భారతీయ మహిళలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. వయస్సుతో పాటు ఈ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయి. 40–49 సంవత్సరాల మహిళల్లో సుమారు 36.9 శాతం ఈ గ్రూప్‌లో ఉన్నారు. పురుషులకు భిన్నంగా మహిళలు తమ మెటబాలిజంపై ప్రభావం చూపే అనేక ప్యూబర్టీ, గర్భం, పోస్ట్‌పార్టమ్ రికవరీ, మెనోపాజ్‌ వంటి జీవసంబంధిత మార్పులను ఎదుర్కోవడమే ఇందుకు కారణం. PCOS, హైపోథైరాయిడిజం, గర్భకాల డయాబెటిస్ వంటి హార్మోన్ల సంబంధిత పరిస్థితులు బరువు నిర్వహణను మరింత సంక్లిష్టం చేస్తాయి. అయితే ఈ శారీరక మార్పులకు వ్యక్తిగతీకరించిన విధానం అవసరమని అంటున్నారు నిపుణులు. మహిళలకు తక్కువ తినమని, ఎక్కువ వ్యాయామం చేయమని సలహా ఇస్తారే కానీ హార్మోన్స్, మెటబాలిక్ ఫ్యాక్టర్స్‌ను విస్మరిస్తారు.

సామాజిక ఒత్తిళ్లు

సామాజిక సమస్యలు కూడా మహిళల బరువు నిర్వహణ ప్రయాణాల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా మంది మహిళలు ఉద్యోగం, సంరక్షణ, ఇంటి బాధ్యతలను ఒకేసారి నిర్వహిస్తారు. దీనివల్ల స్వీయ సంరక్షణకు తక్కువ సమయం మిగులుతుంది. అంతేకాకుండా పరిమిత ఆరోగ్య సేవలు వైద్య పర్యవేక్షణ లేకపోవడం వల్ల స్త్రీలు తీవ్రమైన బరువు తగ్గుదల ప్రణాళికల వైపు మొగ్గు చూపుతారు. ఇవి స్వల్పకాలిక ఫలితాలు ఇవ్వవచ్చు కానీ తరచుగా బరువు తిరిగి పెరగడానికి దారితీస్తాయి. నిర్మాణాత్మక మార్గదర్శకత్వం లేకుండా ఇటువంటి ప్రయత్నాలు పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. GLP-1 మందుల వంటి కొత్త చికిత్సల పాత్ర

ఇటీవలి వైద్య పురోగతి GLP-1 రిసెప్టర్ అగోనిస్టులను పరిచయం చేసింది. ఇది ఆకలిని నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే మెడిసిన్ క్లాస్. ఈ మందులు శరీరంలోని సహజ హార్మోన్లను అనుకరిస్తాయి. బరువు తగ్గడం, కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిల వంటి మెటబాలిక్ మార్కర్లను మెరుగుపరచడంలో ఆశాజనక ఫలితాలను చూపించాయి. అయితే నిపుణులు ఈ మందులను జాగ్రత్తగా ఉపయోగించాలని నొక్కి చెబుతున్నారు. GLP-1 ట్రీట్మెంట్స్ అందరికీ సరిపోవు. ఉదాహరణకు రక్షణ కోసం గర్భం, బ్రెస్ట్‌ఫీడింగ్ సమయంలో సాధారణంగా నివారిస్తారు. ప్యాంక్రియాటైటిస్, తీవ్రమైన జీర్ణ సమస్యలు, మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఇందుకే ఇటువంటి చికిత్సలు ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఆరోగ్య నిపుణులచే ప్రిస్క్రైబ్ చేయబడి పర్యవేక్షించబడాలి.

Next Story