Health : రోజుకు 7,000 అడుగులు.. 50% డెత్ రిస్క్‌ తగ్గుతుందంటున్న నిపుణులు

by Javid Pasha |   (  Updated:2025-06-13 07:46:08  IST  )

Health : రోజుకు 7,000 అడుగులు.. 50% డెత్ రిస్క్‌ తగ్గుతుందంటున్న నిపుణులు

Health : రోజుకు 7,000 అడుగులు.. 50% డెత్ రిస్క్‌ తగ్గుతుందంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : నడక.. బహుశా చాలామంది దీనిని తక్కువగా అంచనా వేస్తుంటారు. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం వాకింగ్ అద్భుతం చేస్తుందని, దీర్ఘాయుష్షును పెంచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రోజుకు కేవలం 7,000 అడుగులు నడిచేవారిలో మిగతా వారితో పోలిస్తే 50% డెత్ రిస్క్‌ తగ్గుతున్నట్లు JAMA నెట్‌వర్క్ ఓపెన్‌‌లో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొందరు రకరకాల కసరత్తులు చేస్తుంటారు. ఎన్ని చేసినా నడకను నిర్లక్ష్యం చేస్తే ఫలితం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఖరీదైన జిమ్ సభ్యత్వం, లేదా తీవ్రమైన కార్డియో వ్యాయామాల అవసరం లేకుండానే రోజూ వాకింగ్ చేయడం ద్వారా (Constant movement every day) మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. అందుకోసం రోజూ 20,000 అడుగులే వేయాలనేం లేదు. చిన్నగా ప్రారంభించి 7000 అడుగులు నడిచినా మీరు తగిన హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగానే నడక అధిక రక్తపోటును నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టోటల్ లైఫ్ క్వాలిటీని పెంచుతుంది. పైగా ఇందుకోసం ఏ జిమ్ సెంటర్‌కో, ప్రత్యేకించి పార్కుకో కచ్చితంగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైనా చేయగలిగే ఈజీ వ్యాయామమే వాకింగ్. డైలీ 10 నిమిషాల నడకతో మొదలుపెట్టి, క్రమంగా సమయాన్ని, అడుగుల సంఖ్యను పెంచుకుంటూ రావచ్చు. మొత్తానికి వాకింగ్ చేయని వారితో పోలిస్తే, రోజూ వాకింగ్ చేసేవారిలో, ముఖ్యంగా 7000 అడుగులు నడిచేవారిలో డెత్ రిస్క్ 50% తగ్గుతుందని నిపుణుల అధ్యయనంలో తేలింది.

Next Story