Health: అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ.. ఎందుకంటే..?

by Javid Pasha |

Health: అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ.. ఎందుకంటే..?

Health: అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ.. ఎందుకంటే..?
X

దిశ, ఫీచర్స్ : పచ్చని ప్రకృతి మధ్య గడపడం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఒక తాజా అధ్యయనం మాత్రం అటవీ ప్రాంతాల్లో నివసించడం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని పేర్కొన్నది. ముఖ్యంగా పట్టణాల్లో నివసించేవారికంటే, అటవీ ప్రాంతాల్లో నివసించే వారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందని వెల్లడించింది. అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం.

*ఎవరు ఆరోగ్యంగా ఉంటారు? పట్టణాల్లో నివసించేవారా? అటవీ ప్రాంతాల్లో నివసించేవారా? ఇది తెలుసుకోవడానికి తైవాన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన వైద్య పరిశోధకులు అక్కడి గ్రామాలు, పట్టణాలు, అటవీ ప్రాంతాల్లో ప్రజలపై పరిశోధనలు నిర్వహించారు. స్థానికుల జీవన శైలి, అక్కడి వాతావరణ ప్రభావాలు వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించారు.

*స్టడీలో భాగంగా పరిశోధకులు మూడు వేలమందిని మూడు గ్రూపులుగా విభజించి పదేండ్లపాటు అధ్యయనం కొనసాగించారు. కాగా ఈ సందర్భంగా పరిశోధకులు తైవాన్‌లో గల నాంటౌ కౌంటీలోని లుగు టౌన్‌షిప్‌కు దగ్గరలో ఉన్న షిటౌ (వెదురు) ఫారెస్టు ప్రాంతాల్లో, పరిసర గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలతో పోలిస్తే అన్ని రకాలుగా సంతోషంగా, ఆరోగ్యంగా గడుపుతున్నారని గుర్తించారు. పైగా వీరిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తక్కువని కూడా కనుగొన్నారు.

*పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువ ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అటవీ ప్రాంతాల ప్రజలు కాలుష్యానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మెరుగైన శారీరక శ్రమ వంటి కారణాలతో వీరి శరీరంలో నేచురల్ కిల్లర్ (NK) కణాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. నిజానికి ఈ కణాలు తెల్ల రక్త కణాల(లింఫోసైట్స్)లో ఒక రకం. మానవ రోగ నిరోధక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తాయి. నిరోధక శక్తిని పెంచడం ద్వారా అటవీ ప్రాంతాల్లో నివసించే వారి రక్తంలో క్యాన్సర్ కణాల నిరోధకానికి కారణం అవుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

Next Story