- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైవాహిక బంధం కంటే ఒంటరితనమే మేలంటున్న మహిళలు..! సంతోషంగా ఉంటున్నది కూడా వాళ్లేనట!!
వైవాహిక బంధం కంటే ఒంటరితనమే మేలంటున్న మహిళలు..! సంతోషంగా ఉంటున్నది కూడా వాళ్లేనట!!

దిశ, ఫీచర్స్ : జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునే అత్యంత ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే.. అది ‘సంతోషంగా ఉండటమే’ అదెలా సాధ్యం? ఎలా పొందాలి? అనేది ఆయా వ్యక్తుల మానసిక భావన, ఆలోచనా విధానం, సామాజిక స్పృహ, పరిస్థితుల ప్రభావం వంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఇక ఇదంతా పక్కన పెడితే వివాహిత మహిళలకంటే.. వివాహం కాని ఒంటరి మహిళలు, పిల్లలు లేని మహిళలు అత్యధిక సంతోషంగా ఉంటారని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఆ వివరాలేంటో చూద్దాం.
మహిళల మానసిక ఆరోగ్యం, వైవాహిక బంధం, వారి జీవితాలపై ప్రభావం గురించి రీసెంట్‌గా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన నిపుణుడు, ప్రొఫెసర్ పాల్ డోలన్ ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. అయితే ఈ పరిశోధన సాంప్రదాయ భావనలను సవాలు చేసిందని, వివాహిత మహిళలకంటే, వివాహం కాని, పిల్లలు లేని ఒంటరి మహిళలే అత్యధిక సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటున్నారని, ఇది మహిళలే అంగీకరిస్తున్నారని అధ్యయనానికి నాయకత్వం వహించిన పాల్ డోలన్ వెల్లడించారు.
జీవితంలో వైవాహిక బంధం, మాతృత్వం వల్ల మాత్రమే మహిళలు సంతోషంగా ఉంటారనే పాత ఆలోచనలకు ఇప్పుడు కాలం చెల్లిందని కూడా తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించినప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలు తక్కువ బాధ్యతలతో ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారని, ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని కూడా అధ్యయనం పేర్కొన్నది. అంతేకాకుండా ఒంటరి మహిలలు తమ కెరీర్, వ్యక్తిగత ఆసక్తులు, సామాజిక సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారని, ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీ రోల్ పోషిస్తుందని స్పష్టం చేసింది.






