- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Technology : జస్ట్ వన్ క్లిక్‌తో మీ కారు సేఫ్.. ఇదొక్కటి ఉంటే చాలు.. (వీడియో)
Technology : జస్ట్ వన్ క్లిక్‌తో మీ కారు సేఫ్.. ఇదొక్కటి ఉంటే చాలు.. (వీడియో)

దిశ, ఫీచర్స్ : ఫోర్‌వీలర్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రజల కలల ప్రయాణం. చిన్నదో పెద్దదో తమకంటూ ఓ కారుంటే ఎక్కడికైనా వెళ్లినప్పుడు రిస్క్ లేకుండా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఆర్థిక స్థోమతను బట్టి ఏదో ఒక కారును కొనుగోలు చేస్తుంటారు. అయితే మెట్రో సిటీస్‌లలో ఇండ్లల్లో పార్కింగ్ ప్లేస్ కొరత వల్ల చాలామంది కారును బయటే ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేస్తుంటారు. దీంతో అది ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము, ధూళికి గురై త్వరగా పాడయ్యే చాన్స్ ఎక్కువ. అలాంటి పరిస్థతి నుంచి రక్షించడానికి ఇప్పుడు ఆటోమేటెడ్ స్మార్ట్ అండ్ పోర్టబుల్ షేడ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దాం.
* స్మార్ట్ అండ్ పోర్టబుల్ షేడ్(Smart and portable shade) అనేది జస్ట్ వన్ క్లిక్‌తో మీ కారును రక్షిస్తుంది. పైగా ఇది ఈజీగా ఉపయోగించగలిగే డిజైన్‌తో తయారు చేయబడింది. బీచ్‌లు, బయట పార్కింగ్ ప్లేస్‌లు.. ఇలా ఎప్పుడు ఎక్కడ పార్క్ చేసినా మీకారును పూర్తిగా కవర్ చేస్తూ ఎండ, వాన, దుమ్ము, ధూళి నుంచి రక్షిస్తుంది. స్మార్ట్ పోర్టబుల్ దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల దానిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
*బయట పార్క్ చేసినప్పుడు ఎండవల్ల వచ్చే యూవీ (UV) కిరణాలు మీ కారు డాష్‌బోర్డ్, సీట్లు, ఇతర అంతర్గత భాగాలను దెబ్బతీస్తాయి. అయితే స్మార్ట్ అండ్ పోర్టబుల్ షేడ్ ఉపయోగిస్తే సమస్య ఉండదు. ఇది యూవీ కిరణాలను 90% సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తుంది. దీంతో మీకారు కలర్‌ను, టోటల్ ఇంటీరియర్‌ను రక్షిస్తుంది. అలాగే కారు క్యాబిన్ వేడిని 30°C వరకు తగ్గిస్తుంది. కాబట్టి కంఫర్టబుల్ డ్రైవింగ్ అనుభవాన్ని సైతం అందిస్తుంది. కారు దీర్ఘకాలంపాటు మన్నికగా ఉండేలా సహాయపడుతుంది.
*స్మార్ట్ అండ్ పోర్టబుల్ షేడ్‌ను ఉపయోగించే విషయానికి వస్తే ఇది చాలా ఈజీ. కారు పైభాగంలో ఉంచి, రిమోట్‌లో బటన్‌ను నొక్కితే చాలు. ఆటోమేటిగ్గా షేడ్ విచ్చుకుని, కారుపై నీడగా మారడం ద్వారా కారును రక్షిస్తుంది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో కారును సేఫ్‌గా ఉంచగలిగే స్మార్ట్ అండ్ పోర్టబుల్ షేడ్‌లు దొరుకుతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా కూడా పొందవచ్చు. Link






