Viral video : ఓర్నీ.. ఈ చిట్టి రోబోట్‌ను చూశారా? కొన్ని క్షణాల్లోనే ఎంత పని చేసిందో..!!

by Javid Pasha |   (  Updated:2025-04-20 13:34:42  IST  )

Viral video : ఓర్నీ.. ఈ చిట్టి రోబోట్‌ను చూశారా? కొన్ని క్షణాల్లో నే ఎంత పని చేసిందో..!!

Viral video : ఓర్నీ.. ఈ చిట్టి రోబోట్‌ను చూశారా? కొన్ని క్షణాల్లోనే ఎంత పని చేసిందో..!!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. దానికి ఏఐ(A.I) తోడవడంతో వింతలు క్రియేట్ చేస్తోంది. ఆయా రంగాల్లోకి ప్రవేశిస్తూ మానవులకు సౌకర్యంగా మారుతోంది. ఇప్పటికే ఇంటి పనులు మొదలు కొని ఇండస్ట్రీయల్ వర్క్స్ వరకు హ్యూనాయిడ్ రోబోట్స్ పలు విధాలుగా సహాయపడుతున్నాయ్. వ్యవసాయ రంగంలోనూ హవా చాటుతున్నాయ్. ఐదారుగురు లేదా అంతకు మించి అనేక మంది వారాలు, నెలల తరబడి చేసే పనులను సైతం క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో చేసేస్తున్నాయ్. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఆకట్టుకుంటోంది.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఒక చిన్నపాటి చిట్టి పొట్టి రోబో పొదలు, కలుపు మొక్కలతో నిండిన పొలంలోకి రయ్యున దూసుకొచ్చింది. అటూ ఇటూ వేగంగా తిరుగుతూ కలుపు మొక్కలను, పొదలను, గడ్డిని చక చకా తొలగిస్తోంది. ఒక విధంగా ఏడెనిమిది మంది వారం రోజులు చేయాల్సిన పనిని కొన్ని క్షణాల్లో పూర్తి చేసింది. దాని పనితీరును చూస్తుంటే.. ఏఐతో కూడిన అధునాతన సెన్సార్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ ఆల్గారితమ్‌లను ఉపయోగించిడంవల్ల అంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయ రంగాన్ని సులభతరం చేయడం కోసం పరిశోధకులు ఇటీవల కలుపు మొక్కలను తొలగించే చిట్టి రోబోట్స్ తయారీపై కూడా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా వైరలవుతున్న రోబోట్ కూడా అలాంటిదే. ఈ అగ్రికల్చరింగ్ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘Where can I get one?’ అంటూ ఒకరు కామెంట్ చేయగా, ‘Need me one of these’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్లతో పలువురు క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నారు. ఇంకెందుకాలస్యం.. మీరూ ఓ లుక్కేయండిక!!

Next Story