ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఈ మార్వాడీ మహిళ రోజూ ఏం చేస్తుందో తెలుసా.?

by Daayi Srishailam |

శ్రీలంకకు వలస వెళ్లిన రాజస్థానీ మహిళ సంస్కృతిపై ప్రేమతో సోషల్ మీడియాలో సరికొత్త సందేశాన్ని ఇస్తోంది

ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఈ మార్వాడీ మహిళ రోజూ ఏం చేస్తుందో తెలుసా.?
X

ఊరు దాటిన వెంటనే..

మూలాలు మర్చిపోతున్న రోజులివి.

ఆధునికత జీవనశైలిలో మునిగి..

సంస్కృతిని విస్మరిస్తున్న తరం ఇది.

ఇక.. విదేశాల్లో సెటిలైతే.. అంతే సంగతి.

కానీ..

ఒక రాజస్థానీ మహిళ శ్రీలంకలో సెటిలైనా..

తన మూలాలు మర్చిపోలేదు.

కళలతో సంస్కృతి కాపాడి ఆదర్శంగా నిలుస్తోంది.

-దిశ, ఫీచర్స్

యువరాగి రాథోడ్ వాళ్లది జోధ్‌పూర్. ప్యూర్ రాజస్థానీ ఫ్యామిలీ. వాళ్లు జోధ్‌పూర్ నుంచి వలస వెళ్లి శ్రీలంకలో స్థిరపడ్డారు. మార్వాడీస్ ఎలా ఉంటారో తెలుసు కదా.? కంప్లీట్ ట్రెడిషనల్ లైఫ్ వాళ్లది. శ్రీలంకలో కూడా అలా ఉండలేరు కదా.? అలా ఉండటం కాదు.. అక్కడి నుంచే భారతీయ సంస్కృతిని పరిరక్షించే బాధ్యత తీసుకుంది యువరాగి.

సంస్కృతిపై ప్రేమ

ఆమె పుట్టి పెరిగిందంతా జోధ్‌పూర్‌లోనే. తన బాల్యం రంగులు.. రుచికరమైన ఆహారం.. సంప్రదాయాలతో నిండి ఉండేది. తల్లిపాడే మార్వాడీ జోలపాటలు.. పండుగల సందడి.. ఆచారాలు యువరాగి జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఈ సంప్రదాయాలు కేవలం ఆచారాలు కాదు.. తరతరాలుగా వచ్చిన జ్ఞాపకాలు. రుచికరమైన దాల్ బాటీ.. అమ్మ పాటలతో తనకు సంస్కృతి పట్ల అభిమానాన్ని కలిగించాయి. ప్రేమను పెంచాయి. ఇండియాలో ఉన్నంతకాలం కల్చరల్ లైఫ్‌నే ఆస్వాదించింది.

సంస్కృతి పాఠాలు

శ్రీలంకకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాక గతకాలపు జీవిత మాధుర్యం కొంత ప్రశ్నార్ధకంగా మారింది. జోధ్‌పూర్‌లో మాదిరి శ్రీలంకలో దాల్ బాటీ వాసనలు.. మార్వాడీ సంభాషణలు.. వాళ్లమ్మ జోలపాటలు వినిపంచవు కదా.? ఒక కొత్త వాతావరణంలో ఉంటున్న భావన కలిగిది. ఇలా అయితే భారతీయ సంస్కృతి గురించి తన పిల్లలు ఏం నేర్చుకుంటారు.? అనే ప్రశ్న మొదలైంది. తన పిల్లలు కూడా తన బాల్యం లాంటి అనుభూతుల్ని కోల్పోవద్దని సంస్కృతి పాఠాలు మొదలుపెట్టింది.

ఇంటర్నెట్ సంచలనం

మనం ఎక్కడైనా ఉండొచ్చు.. ఏమైనా చేయొచ్చు. కానీ మన మూలాలైతే ఎప్పటికీ సజీవంగా ఉండాలి కదా అనుకొని భారతీయ సంస్కృతి.. మార్వాడీ ఆచారాలు.. భాష గురించి ప్రచారం చేయాలనుకుంది యువరాగి. కథల ద్వారానే వాటికో ప్రత్యేకతను తీసుకొచ్చింది. తన కూతుర్లతో మొదలైన ఆ కథల ప్రస్థానం.. ప్రపంచానికి చూపిచాలనుకుంది. చేత్తో తయారుచేసిన బొమ్మలు.. ఆసక్తికరమైన కథనాలు.. మార్వాడీ యాసలో ఇంటర్నెట్లో చెప్పడం మొదలుపెట్టింది. వీరుల కథనాలు.. ఆచారాలు గురించి చెప్పడంతో ట్రెండ్ సెట్టర్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్ ఫేం

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీరోజూ ఒక కథ చెప్తుంటుంది యువరాగి. రాజస్థానీ పిల్లల కోసం ప్రతీరోజు ఒక కొత్త పదాన్ని పరిచయం చేస్తుంది. ఈ చిన్న ప్రయత్నం మార్వాడీ భాషను సజీవంగా ఉంచుతుంది. భారతీయ సంస్కృతిని పదిలంగా ఉంచుతుంది. ఆమె చెప్పే కథలు.. ప్రదర్శించే బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకర్షిస్తున్నాయి. మొదట్లో కొందరు హేళన చేశారు. కానీ క్రమంగా ఆమె చెప్పేవన్నీ నాస్టాల్జియాగా అర్థం చేసుకొని ప్రశంసిస్తున్నారు. ఒక్కో కథ ద్వారా గతాన్ని.. వర్తమానాన్ని అనుసంధానం చేస్తోందామె.

Next Story