- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fatty Liver : ముఖంలో వాపు, శరీరంపై దురద.. ఈ వ్యాధి సంకేతం కావచ్చు!
Fatty Liver : ముఖంలో వాపు, శరీరంపై దురద.. ఈ వ్యాధి సంకేతం కావచ్చు!

దిశ, ఫీచర్స్ : ముఖంలో తరచుగా వాపు వచ్చినట్లు కనిపిస్తోందా? అకారణంగా చర్మం నల్లబడటం మళ్లీ సాధారణ స్థితికి చేరడం వంటి ప్రక్రియ రిపీట్ అవుతోందా? ఇలటా దీర్ఘకాలంపాటు జరుగుతుంటే మాత్రం మీరు ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ముఖంలో ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి కాలేయంలో స్థాయికి మించి ఫ్యాట్ పేరుకుపోవడం అనేది వ్యాధి లక్షణం. ఇలాంటప్పుడు కాలేయం తగినంత ప్రోటీన్‌లను ఉత్పత్తు చేయదు. దీంతో శరీరంలోని అవయవాలకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. వ్యర్థాల తొలగింపులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా ముఖం ఉబ్చినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాలేయం పనితీరు
శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. బాడీలోని హానికరమైన పదార్థాలను వడబోసి బయటకు పంపండంలో సహయపడుతుంది. రోజూ తినే ఆహారంలోని కొవ్వులను, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఎనర్జీకోసం గ్లైకోజెన్, విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలను స్టోర్ చేస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైములను తయారు చేస్తుంది. ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు అధిక రక్తస్రావం ప్రాణానికి ముప్పు కలిగిస్తుంది. అయితే లివర్ రక్తం గడ్డకట్డంలో సహాయపడే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రాణాలను రక్షిస్తుంది. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
లివర్‌లో కొవ్వు పేరుకుపోతే..
కాలేయం శరీరంలో ముఖ్యమైన భాగమే కాదు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో అది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటివి కాలేయ వ్యాధులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే సమస్యను ఇటీవల చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనినే ఫ్యాటీ లివర్ డిసీజ్ లేదా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా అంటారు. జంక్ ఫుడ్స్ లేదా అధిక కేలరీలు కలిగిన ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దానిని ఎలా గుర్తించాలి? అన్నప్పుడు శరీరంలో, ముఖంలో కొన్ని లక్షణాలను బట్టి కూడా గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కొనే వారిలో కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగనీ మిగతా వారికి రావని కాదు, ప్రధానంగా ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు కారణం అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
కాలేయ వ్యాధి క్షణాలు
జర్నల్ ఆఫ్ బయోమెడిసిన్‌లో పబ్లిషైన ఓ స్టడీ ప్రకారం.. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతీ ఐదుగురిలో ఒకరికి దురద వస్తుంది. ముఖ్యంగా ఇది ముఖంపైనే సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు శరీరంలో తగినంత ప్రోటీన్ ఉత్పత్తి కాకపోవడం, రక్త ప్రసరణ సాఫీగా లేకపోవడం కారణంగా ముఖంలో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫ్యాటీ లివర్ డిసీజ్ బాడీలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. అంటే ఈ సమయంలో శరీరంలో ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించదు. దీంతో అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా అకాంథోసిస్ నైగ్రికన్స్ అనే చర్మ సమ్యకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెడచుట్టూ నల్లబడటం, నల్లటి చారలు ఏర్పడటం వంటి లక్షణాలు బయటకు కనిపిస్తాయి.
రోసేసియా
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు కాలేయానికి రక్త సరఫరా సక్రమంగా ఉండని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీంతో రక్త నాళాలు ఎర్రబడటం, ముఖంపై తెల్లటి గడ్డలు ఏర్పడటం వంటివి సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎల్లప్పుడూ ఫ్యాటీలివర్ డిసీజ్‌కు సంబంధించిన లక్షణం కాదు, కానీ కాలేయంలో కొవ్వు పేరుకుపోయిన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నోటి చుట్టూ దద్దుర్లు
కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయే ఫ్యాటీ లివర్ డిసీజ్ కలిగి ఉన్నప్పుడు శరీరం జింక్ వంటి కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించలేదు. దీంతో జింక్ లోపం ఏర్పడుతుంది. ఇది చర్మంలో మంట, వేడి సమస్యకు దారితీయవచ్చు. అట్లనే నోటి చుట్టూ దద్దుర్లు, గడ్డలు వంటివి ఏర్పడటం తరచుగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ముఖం సహా శరీరంలోని ఇతర భాగాలపై దురద సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.
లివర్ సిర్రోసిస్
ఫ్యాటీ లివర్ సమస్యను గుర్తించి కూడా తగిన చికిత్స తీసుకోకపోతే అది లివర్ సిర్రోసిస్ అనే వ్యాధికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంటే ఇది కాలేయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితికి నిదర్శనం. ఈ సందర్భంలో కాలేయంపై మచ్చలు ఏర్పడతాయిన వైద్య నిపుణులు చెబుతున్నారు. అట్లనే లివర్ సిర్రోసిస్ అనే వ్యాధి దశలో ఉన్నప్పుడు చర్మం పసుపు రంగులోకి మారడం, దురద పెట్టడం, తీవ్రమైన శారీరక బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు నుంచే మీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారపు అలవాట్లు, జీవన శైలి పద్ధతులు కలిగి ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్ సంకేతాలు కనిపించగానే సరైన సమయంలో వైద్య నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More : పెద్ద పేగును క్లీన్ చేస్తే ఎన్ని వ్యాధుల్ని నివారించవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారు?






