వీడు మామూలోడు కాదు.. ఒకేసారి 35మందిని మెయింటెన్ చేశాడు.. కానీ చివరకు సినిమా లెవల్ ట్విస్ట్

by Sujitha Rachapalli |

సీరియస్ లవ్‌లో ఉన్నారంటే.. ఒక్కరినే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అదే ప్లే బాయ్ అయితే.. ఒకేసారి ఇద్దరు ముగ్గురిని మెయింటెన్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. వారితో డీప్ లవ్‌లో ఉన్నానని నమ్మిస్తూ రొమాన్స్‌ కోరుకుంటాడు.

వీడు మామూలోడు కాదు.. ఒకేసారి 35మందిని మెయింటెన్ చేశాడు.. కానీ చివరకు సినిమా లెవల్ ట్విస్ట్
X

దిశ, ఫీచర్స్: సీరియస్ లవ్‌లో ఉన్నారంటే.. ఒక్కరినే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అదే ప్లే బాయ్ అయితే.. ఒకేసారి ఇద్దరు ముగ్గురిని మెయింటెన్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడు. వారితో డీప్ లవ్‌లో ఉన్నానని నమ్మిస్తూ రొమాన్స్‌ కోరుకుంటాడు. చాలా మంది ఇలా ఉంటారు. కానీ ఒకేసారి 35 మందితో డేటింగ్ చేయడం నిజంగా రికార్డ్. ఇదే పని చేశాడు జపాన్‌కు చెందిన తకాషి మియాగావా. వీరందరికీ ఎమోషనల్‌గా దగ్గరై మోసం చేశాడు. ఆ తర్వాత జైలు పాలయ్యాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశాడు? ఏ విధంగా మోసం చేశాడు? అనేది తెలుసుకుందాం.

మియాగావా నిజానికి ఒక సేల్స్‌‌మెన్. కాబట్టి సంపాదన అంతంతే. కాగా ఏడాది పొడవునా ఏదో ఒక రూపంలో బహుమతులు పొందాలని ఓ ప్లాన్ వేశాడు. కస్టమర్స్‌తో కనెక్ట్ అవుతూ వచ్చాడు. ప్రేమ పేరు చెప్పి బాగా దగ్గరయ్యాడు. 35 మందిని లైన్‌లో పెట్టి ఒక్కొక్కరికి ఒక్కో బర్త్ డే డేట్ చెప్తూ వచ్చాడు. ఇక్కడి డేటింగ్ కల్చర్‌లో పుట్టినరోజుల బహమతులు ఇవ్వడం ఆనవాయితీ. కాబట్టి దీంతో ఎక్కువ సార్లు బహుమతులు పొందొచ్చని భావించాడు. ప్లాన్ వర్కవుట్ అయింది కూడా. ఏటా దాదాపు లక్ష రూపాయల విలువైన బహుమతులను పొందాడు. హ్యాపీగా ఉన్నాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. బాధిత మహిళల అంతా ఈ వ్యక్తి నిజస్వరూపాన్ని తెలుసుకుని.. విక్టిమ్ అసోసియేషన్ పేరుతో నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మోసం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు మియాగావా. మహిళలను తప్పుదారి పట్టించి ఆర్థిక లాభం పొందినందుకు గాను..జపాన్ చట్టం ప్రకారం క్రైమ్‌గా పరిగణించబడింది. మొత్తానికి ఈ కేసు జపాన్‌లో డేటింగ్ రిలేషన్‌షిప్స్‌లో నమ్మకం, పారదర్శకత గురించి చర్చను రేకెత్తించింది. ఎమోషనల్ మానిపులేషన్ హానికరమైన ప్రభావాలను హైలైట్ చేసింది.

Next Story