పురుషుల భయంతో ఒళ్లు దాచుకుంటున్న మహిళలు

by Disha Web Desk |
పురుషుల భయంతో ఒళ్లు దాచుకుంటున్న మహిళలు
X

దిశ, ఫీచర్స్: దశాబ్దాల కాలంగా మహిళలు సామాజిక పక్షపాతం, వివక్ష, అసమానతలను ఎదుర్కొంటున్నారని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోంది. పది సంవత్సరాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 77 శాతం మంది అన్ని విషయాల్లోనూ కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. అదే సందర్భంలో ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు తమకు మునుపటి తరాలకంటే ఎక్కువగా సామాజిక అడ్డంకులు ఉన్నాయని భావిస్తున్నారు. మహిళల సాధికారత గురించి తెలుసుకునే ఉద్దేశంతో 2023 మార్చి నుంచి ఏప్రిల్ వరకు ప్రముఖ సంస్థ OnePoll నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గలవారిని, అలాగే 55 నుంచి 80 సంవత్సరాల వయస్సుగలవారిని మొత్తం 2000 మంది మహిళలను స్టడీ చేశారు. వారు సమాజంలో తమను తాము ఎలా భావిస్తున్నారో అబ్జర్వ్ చేశారు. ప్రతీ ఐదుగురిలో నలుగురు మహిళలు సొసైటీ స్త్రీ విషయంలో వ్యవహరించే తీరు తమను స్ట్రెస్‌కు గురిచేస్తుందని పేర్కొన్నారు.

ఆధునిక అడ్డంకులు

ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటున్నప్పటికీ ఆధునిక మహిళలు తరచూ అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. సమాజం లేదా పురుషుల ద్వారా ఇబ్బందులను ఎదుర్కోవడానికి తమ బాడీ పార్ట్స్‌ను దాచుకోవడం లేదా కప్పుకోవడం చేస్తున్నట్లు 23శాతం మంది మహిళలు తెలిపారు. ఇక 20శాతం మంది వృద్ధాప్య భయంతో ఇబ్బందిపడుతున్నారు. దాదాపు 5వ వంతు మంది మహిళలు (19%) తమ పని, కుటుంబ జీవితం, సామాజిక పరిస్థితులను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రతీ 10 మందిలో ఏడుగురు తమ బాడీ షేప్(38%), రూపురేఖలు (35%), ఫిజికల్ హెల్త్ (31%) గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో (71%) అనే విషయంలో ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

మరింత నమ్మకంగా

తమ జీవితంలో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. జెండర్ గురించి మాత్రం గర్వపడుతున్నట్లు 93శాతం మంది మహిళలు తెలిపారు. వాస్తవానికి మెజారిటీ స్త్రీలు 10 సంవత్సరాల క్రితం (77%) కంటే కూడా నేడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 63 శాతం మంది మహమ్మారికి ముందు కంటే కూడా ప్రస్తుతం మరింత శక్తివంతంగా(empowere) ఉన్నారు. తమను తాము మరింత పవర్‌ఫుల్‌గా నిరూపించుకోవడానికి తాము చేసే ప్రతీ పనిలో పరిపూర్ణంగా ఉండవలసిన అవసరాన్ని అధిగమిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఓపికగా ఉంటున్నారు. సర్వే ప్రకారం.. సాధికారత అనుభూతికి(feeling empowered ) సంబంధించిన ప్రధాన లక్షణాలు విశ్వాసం, నిజాయితీ, తల్లి ద్వారా ప్రేరణ పొందడం, అమ్మమ్మ, ఫిమేల్ బాస్ సలహాలు ప్రధానంగా ఉంటున్నాయి.

పవర్ ఫుల్ టూల్‌గా నాలెడ్జ్

మహిళలు తమపై తాము నమ్మకంతో ఉండటానికి సోషల్ నాలెడ్జ్ కూడా ఒక పవర్ ఫుల్ టూల్‌గా ఉంటోంది. ప్రతీ ఆరుగురిలో ఒకరు ఎక్కువ సమాచారం తెలిసి ఉండటం మరింత శక్తివంతం కావడానికి సహాయపడుతుందని చెప్పారు. 29 శాతం మంది సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంవల్ల ఆత్మవిశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక 27 శాతం మంది ప్రపంచ సమస్యల గురించి తాము అవగాహన కలిగి ఉంటామని తెలపగా.. కంఫర్టబుల్‌, నాలెడ్జ్ ద్వారా సాధికారత వంటి అంశాల్లో సహాయపడటానికి మహిళలు తమ తోటి స్త్రీలకు కొన్ని సలహాలు ఇస్తారని సర్వే పేర్కొంది. అలాగే సక్సెస్‌ఫుల్ ఉమన్ పాజిటివ్‌గా ఉండటం.. ఇతరులు కూడా ఆత్మ విశ్వాసంతో ఉండేందుకు కారణమవుతోంది.

ఫిజికల్ హెల్త్

ఫిజికల్ హెల్త్‌ను మేనేజ్ చేయడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి పాజిటివ్ ఎమోషనల్ ఔట్‌ లుక్ కలిగి ఉండటం. సపోర్టివ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం కూడా కీ రోల్ పోషిస్తున్నాయని డౌలా లారా గింబర్ట్ అన్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేయడం, ఇతర సోషల్ కనెక్టింగ్ యాక్టివిటీస్ మహిళల్లో ఆరోగ్యానికి, ఆత్మ విశ్వాసానికి థెరపాటిక్‌గా ఉంటున్నాయని చెప్పారు. అయితే మహిళలు వృద్ధాప్యంలో తమను అభద్రతా భావం వెంటాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. అందుకే సగటు స్త్రీ ఇప్పటికీ వారానికి నాలుగు రోజులు తమ శరీరం గురించి స్వీయ స్పృహతో ఉన్నట్లు అనిపిస్తోందని సర్వే పేర్కొన్నది. సగటున వారానికి మూడు సార్లు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం లేదా బరువులు ఎత్తడం గురించి ఆందోళన చెందుతున్నారు. ‘‘ప్రతీ ముగ్గురు యూఎస్ మహిళల్లో ఇద్దరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో యూరిన్‌ను ఆపుకొనలేని పరిస్థితిని(urinary incontinence) ఎదుర్కొంటారనే విషయం ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం’’ అని ఫిట్‌రైట్ ఫ్రెష్ స్టార్ట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ తంబ్రా మార్టిన్ (Tambra Martin) అంటున్నారు.

Also Read. నర్వ్ ఫ్లాసింగ్.. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌‌ను తగ్గించే మోడ్రన్ ట్రీట్‌మెంట్


Next Story

Most Viewed