Viral : పొడుగు, పొట్టి కాదు.. సంబంధంలో ఆ విషయాలే ముఖ్యమంటున్న జంట !

by Javid Pasha |   (  Updated:2025-09-29 07:29:45  IST  )

అబ్బాయి ఎక్కువ హైట్ ఉన్నాడనో, మరీ పొట్టిగా ఉన్నాడనో అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోరు. కానీ ప్రముఖ రష్యన్ మోడల్ అయిన ఇసాబెల్, జాహిద్ అలీ మాత్రం ఇందుకు భిన్నం. ఏం చేశారంటే..

Viral : పొడుగు, పొట్టి కాదు.. సంబంధంలో ఆ విషయాలే ముఖ్యమంటున్న జంట !
X

దిశ, ఫీచర్స్ : స్త్రీ, పురుషులు వివాహ బంధంతో ఒక్కటవ్వాలంటే.. ఈడూ జోడూ సరిగ్గా కుదరాలంటారు పెద్దలు. వివిధ అంశాల్లో ఏకాభిప్రాయంతోపాటు భార్య భర్తల శారీరక పరిణామాలు కూడా ఇందులో భాగంగా పరిగణిస్తారు. అంటే ఆనవాయితీ ప్రకారం భర్త భార్యకంటే కొంచెం హైట్ ఉండాలి. లేదా సమానంగా ఉన్నా పర్లేదని చెబుతుంటారు. భార్య ఎంత పొట్టిగా ఉన్నా పర్లేదు. కానీ భర్త భార్యకంటే పొట్టిగా ఉండటాన్ని చాలామంది అంగీకరించరు. కానీ ఇది తప్పు శారీరక పరిణామాలు సంబంధానికి, ప్రేమకు అడ్డంకి కానే కాదని నిరూపించింది ఒక ఆదర్శ జంట. ప్రస్తుతం వారి వివాహ బంధం గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

అబ్బాయి ఎక్కువ హైట్ ఉన్నాడనో, మరీ పొట్టిగా ఉన్నాడనో అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోరు. అబ్బాయిలు కూడా అంతే. కొంచెం తేడాను ఒప్పుకుంటారేమోకానీ కాస్త ఎక్కువుంటే మాత్రం ససేమిరా అంటారు. వివాహ విషయంలోనే కాదు ప్రేమ, డేటింగ్ విషయాల్లోనూ ఇది పరిగణనలోకి తీసుకుంటారు. కోట్లాది సంపదకు అధిపతులైనప్పటికీ ప్రముఖ రష్యన్ మోడల్ అయిన ఇసాబెల్, జాహిద్ అలీ మాత్రం ఇందుకు భిన్నం. ఇందులో జాహిద్ అలీ చాలా పొట్టిగా ఉంటాడు. ఇసాబెల్ అతనికంటే చాలా ఎక్కువ హైట్ ఉంటుంది. కానీ వీరిద్దరూ పెళ్లి వివాహ బంధంతో ఒక్కటై ఆదర్శ దంపతులుగా నిలిచారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, సంబంధాల్లో జంటలంటే ఇలాగే ఉండాలని ఆపాదించబడిన పాత భావనలను సవాలు చేస్తోంది.

ఇంతకీ జాహిద్, ఇసాబెల్ బంధం ఎలా ఏర్పడిందంటే.. ముందుగా వీరు ఛారిటీ ఈవెంట్‌లో కలుసుకున్నారట. అక్కడే జాహిద్ ఇసాబెల్‌ను చూసి ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతని ప్రపోజల్ కు ఒప్పుకున్నది. సంపద ముఖ్యం కాదు సంబంధంలో సంతోషం, భావోద్వేగం, ఆత్మ విశ్వాసం, స్థిరత్వం ముఖ్యం అనే భావనతో కూడిన వీరి ఆలోచనలు, వివిధ అంశాల్లో అభిప్రాయాలు కలిశాయి. ఇంకేముంది వివాహ బంధంతో ఒక్కటైపోయారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ రోజుల్లోనూ సంపదకంటే సంబంధంలో లవ్, ఎమోషనల్ సపోర్ట్ ముఖ్యమని నమ్మేవాళ్లు ఉండటం గర్వకారణమని పలువురు ప్రశంసిస్తున్నారు. Link

Next Story