మేకప్‌లో నయా ట్రెండ్.. ప్రపంచంలోని అందరి ఆడవాళ్ల చూపు దానిపైనే!

by Yella Dhawani Reddy |

చాలా మంది ఆడవాళ్లు అందంగా, తాజాగా కనిపించేందుకు మేకప్ వేసుకోవడాన్ని ఇష్టపడుతుంటారు.

మేకప్‌లో నయా ట్రెండ్.. ప్రపంచంలోని అందరి ఆడవాళ్ల చూపు దానిపైనే!
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది ఆడవాళ్లు అందంగా, తాజాగా కనిపించేందుకు మేకప్ (Makeup) వేసుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. అందుకోసం ఫౌండేషన్, కన్సీలర్, ఐ షాడో, కంటూర్, బ్లష్ వంటి అనేక రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మినిమలిస్ట్ బ్యూటీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో 'కొరియన్ గ్లాస్ స్కిన్' (Korean glass skin) ట్రెండ్ సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అవుతోంది. సెలబ్రిటీలు, బ్యూటీ బ్లాగర్లు ఈ గ్లాస్ స్కిన్ పొందెందుకు ట్యుటోరియల్స్‌ చేస్తూ ట్రెండ్‌ను మరింత బలోపేతం చేస్తున్నారు.

ఈ లుక్‌లో ప్రధానంగా స్కిన్ హైడ్రేషన్, నిగారింపు, సహజ గ్లోకి ప్రాధాన్యం ఉంటుంది. ఫౌండేషన్, కవర్-అప్ వంటి మాస్కింగ్ మేకప్ వాడకం తగ్గిపోయి, తక్కువ పదార్థాలతో చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. పైగా సహజత్వాన్ని నిలబెట్టే ఈ లుక్, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతూ అందాన్ని నింపుతుంది. నిజానికి ఈ గ్లాస్ స్కీన్ ట్రెండ్ దక్షిణ కొరియాలోని స్కిన్‌కేర్ సంస్కృతి నుంచి పుట్టింది. అయితే ఇటీవల కొరియన్ డ్రామాలు, K-pop సంస్కృతి భారత యువతపై గాఢమైన ప్రభావం చూపుతున్నాయి. వాటిలో నటీనటుల చర్మం అద్దంలా మెరిసే విధంగా ఉండటం వల్ల ‘గ్లాస్ స్కిన్’ ఓ డ్రీమ్‌లుక్‌గా మారింది. అందుకే ఇప్పుడు భారతీయ మార్కెట్‌ కూడా ఈ ట్రెండ్‌ను స్వీకరిస్తోంది.

ఈ ట్రెండ్ ప్రభావంతో భారతీయ మేకప్ బ్రాండ్‌లు కూడా డ్యూయ్ ఫినిష్ ఫౌండేషన్‌లు, హైడ్రేటింగ్ మిస్ట్‌లు, స్కిన్‌టింట్‌లు లాంటి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అలాగే గతంలో మేకప్ అంటే చర్మాన్ని కవర్ చేయడం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు గ్లాస్ స్కిన్ ట్రెండ్ ద్వారా అదే చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచడమే అసలైన అందం అని యువత గుర్తించేస్తోంది. ఇక కొరియన్ బ్యూటీ రొటీన్‌లో భాగమైన క్లీన్‌సింగ్, టోనింగ్, సీరమ్, మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్ వంటి దశలతో ముఖాన్ని మంచి పద్ధతిలో మెయింటేన్ చేస్తే ఈ గ్లాస్ స్కీన్ లుక్ పొందడం సాధ్యమవుతుంది.

గ్లాస్ స్కిన్ కోసం చర్మ సంరక్షణ దినచర్య:

* గ్లాస్ స్కీన్ పొందాలంటే రోజు చర్మాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో మృదువుగా శుభ్రపరచుకోవాలి.

* చర్మాన్ని మృదువుగా చేయడానికి, డెడ్ సెల్స్ తొలగించడానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.

* చర్మ రక్షణ కోసం విటమిన్ సి సీరం, హైలురోనిక్ యాసిడ్ సీరం వంటి సీరమ్‌లు ఉపయోగించాలి.

* చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

* అలాగే తప్పనిసరిగా రోజు సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

Next Story