Viral : వర్ష బీభత్సం.. ఒక్కసారిగా విరిగి మీదపడ్డ వేపచెట్టు.. తండ్రీ కూతుళ్ల పరిస్థితి ఘోరం!

by Javid Pasha |

Viral : వర్ష బీభత్సం.. ఒక్కసారిగా విరిగి మీదపడ్డ వేపచెట్టు.. తండ్రీ కూతుళ్ల పరిస్థితి ఘోరం!

Viral : వర్ష బీభత్సం.. ఒక్కసారిగా విరిగి మీదపడ్డ వేపచెట్టు.. తండ్రీ కూతుళ్ల పరిస్థితి ఘోరం!
X

దిశ, ఫీచర్స్ : పలుచోట్ల కురుస్తున్న ఎడతెరిపి లేని వానలు జన జీవనాన్ని అస్తవ్యవస్తం చేస్తున్నాయి. వానలతో, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే రీసెంట్‌గా గురువారం ఉదయం 9:50 గంటల సమయంలో ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఘోరం జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి రావడం కొందరిప్రాణాల మీదకు తెచ్చింది. వైరల్ సమాచారం ప్రకారం.. కల్కాజీ ఏరియాలోని ఓ రోడ్డుపై వర్షంలోనూ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఈ సందర్భంలో ఓ పెద్ద వేపచెట్లు వేర్లతో సహా విరిగి వాహనదారులమీద పడగా.. టూ వీలర్‌పై వెళ్తున్న సుధీర్ కుమార్ (50), ప్రియా (22) అనే తండ్రీ కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని బైక్ సహా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో (Times Now) వైరల్ అవుతుండగా.. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

Next Story