- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెళ్లి అయినా 13 ఏళ్లకు గర్బం దాల్చిన మహిళ.. కేవలం స్త్రీల సమస్యేనా?

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అయినా ప్రతి స్త్రీ తల్లి అవ్వాలని కోరుకుంటుంది. తల్లి కావటం గొప్ప వరంగా భావిస్తుంది. కానీ, అనివార్య కారణాలతో వివాహమై ఏళ్లు గుడుస్తున్నా తల్లి కాకపోతే ఆ మహిళ పడే వేధన వర్ణనాతీతం. ఇటు కుటుంబసభ్యుల నుంచి అటు సమాజం నుంచి అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగి చికిత్సలు చేయించుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినా పిల్లలు కలుగకపోతే గొడ్రాలు అంటూ సమాజం నిందలు వేస్తుంటే మానసికంగా కుంగిపోతుంది. మరీ పెళ్లి అయినా 13 ఏళ్లు గర్భం దాల్చితే ఆ మహిళ సంతోషానికి అవధులుండవు. ఇన్నాళ్ల ఆమె మానసిక క్షోభ నుంచి ఒక్కసారిగా తేలిపోతుంది. ఇలాంటి ఓ ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ఓ మహిళ పెళ్లి అయినా 13 ఏళ్లకు గర్భం దాల్చింది. ఈ సంతోషకరమైన వార్త వినగానే ఆ మహిళ సంతోషం అంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేసింది. ఆమె హృదయం ఆనందంలో నిండిపోయింది. అయితే ఆమె కన్నీళ్లు చూస్తుంటే.. అత్తమామలు, సమాజం నుంచి, ఆమె భర్త నుండి ఎదుర్కొన్న ఎన్నో కష్టాలను, మనోవేదన స్పష్టంగా చెబుతున్నాయంటూ వీడియోను షేర్ చేసిన వారు రాసుకొచ్చారు. అలాగే, ఒకవేళ సమస్య ఆమె భర్తలో ఉంటే ఎవరు ఏం మాట్లాడరని, భారతీయ సమాజంలో ఈ విషయం బహిరంగంగా చర్చించరని, సాంప్రదాయ దృక్కోణంలో, సంతానలేమిని స్త్రీ సమస్యగానే చూస్తారని మండిపడ్డారు. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.