- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జిప్డ్ మ్యాంగో..' ఇదేంటీ కొత్త రకం మామిడి పండా?! చూడండీ
మామిడి పండ్లు వస్తాయనే ఆత్రుతే ఎక్కువగా ఉంటుంది. A mango video has caught the attention of the netizens.

దిశ, వెబ్‌డెస్క్ః పండులో రారాజు మామిడి పండు! వేసవిలో సెగలు కక్కే ఎండలు ఉంటాయనే భయం కంటే, కమ్మని మామిడి పండ్లు వస్తాయనే ఆత్రుతే ఎక్కువగా ఉంటుంది. అలాంటి మామిళ్లలో ఏన్నెన్నో రకాలు ఇప్పుడు నోరూరిస్తుంటాయి. అయితే, ఇలాంటి వాటిల్లో జిప్పున్న మామిడిని ఎప్పుడూ చూసుండరు! కానీ, సోషల్ మీడియాలో ఈ రకం మామిడి పండు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి జిప్పర్‌తో మామిడికాయను పట్టుకుని కనిపించాడు. ఫస్ట్ సైట్‌లో, అది పండు రూపంలో ఉన్న పర్స్‌లా కనిపిస్తుంది. కానీ, జిప్ ఓపెన్ చేస్తే, దానిలోని రుచికరమైన మామిడి గుజ్జును చూడొచ్చు. ఇది నిజంగానే జిప్‌తో పండిన మామిడి పండా, లేదంటే జిప్ తగిలించిన మామిడా అనేది ఇంకా తెలియదు! ఏది ఏమైనా @beautifulearth అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోలో ఉన్న మామిడి పండుకు జిప్ పెట్టిన వ్యక్తి మాత్రం సూపర్ పర్ఫెక్ట్‌గా చేశాడంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.






