- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : బండి మీద వెళ్తుండగా ఒక్కసారిగా దూకేసిన భార్య.. మరీ అట్ల చేస్తే ఎట్లా బ్రో.. అంటూ భర్తను తిట్టిపోస్తున్న నెటిజన్లు !
Viral video : బండి మీద వెళ్తుండగా ఒక్కసారిగా దూకేసిన భార్య.. మరీ అట్ల చేస్తే ఎట్లా బ్రో.. అంటూ భర్తను తిట్టిపోస్తున్న నెటిజన్లు !

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు, అందులోని సన్నివేశాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని కోపం తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని ఆయా వ్యక్తుల నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లకు కట్టడంవల్ల అలర్ట్ చేస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ వ్యక్తి బైకుమీద వెళ్తుండగా.. అతని భార్య మధ్యలోనే ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో మరీ అలా చేస్తే ఎలా బ్రో.. కొంచెం కూడా సోయిలేకుండా.. అంటూ భర్తను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ సమాచారం ప్రకారం.. ఒక వ్యక్తి బైకుమీద తన భార్యను, ఐదేండ్లలోపు కొడుకును కూర్చో బెట్టుకొని రోడ్డుమీద వెళ్తున్నాడు. ఈ సందర్భంలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే సదరు వ్యక్తి మాత్రం బైకును అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు. పరిస్థితి చూస్తుంటే ఎక్కడ కింద పడతాడో, ఏ వాహనానికి ఢీకొంటాడో అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఫుల్లుగా తాగి ఉన్నాడు. సోయిలేకుండా బండిని ఎటుబడితే అటు నడుపుతున్నాడు. ఓ వాహనానికి ఢీకొట్టబోయి జస్ట్ మిస్ అయింది కూడా.
అయితే పరిస్థితి అదుపు తప్పేలా ఉందని గ్రహించిన సదరు బైకర్ భార్య దారిమధ్యలోనే ఒక్కసారిగా వాహనంపై నుంచి కిందకు దూకేసింది. కానీ తాగిన మైకంలో ఉన్న ఆమె భర్త ఇది గమనించకుండానే స్పీడ్‌గా దూసుకెళ్తున్నాడు. వెనుక వచ్చే ఇతర బైకర్లు గమనించి అతన్ని పిలిచినా వినిపించుకోకుండా వేగంగా కిలోమీటర్ దూరం వరకు అలాగే వెళ్లిపోయాడు. అయితే అతని భార్య దూకేసిందనే విషయం చెప్పేందుకు అతన్ని వెంబడించిన ఇతర వాహనదారులు చివరకు ఒక దగ్గర ఆపి అసలు విషయం చెప్పి హెచ్చరించారు. ప్రజెంట్ ఈ వీడియోను టైమ్స్ నౌ(timesnow) ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు ‘మరీ అంతసోయి లేకుండా తప్పతాగి నడిపితే ఎలా బ్రో.. భార్య ఏమైపోయిందో కూడా చూసుకోవా’ అంటూ తిట్టిపోస్తున్నారు.
Video credits go to timesnow insta handle






