ఇండ్ల నిర్మాణానికి గడ్డిపొర ఇటుకలు.. ఎకో ఫ్రెండ్లీ Smart Moss Bricksను డెవలప్ చేసిన నిపుణులు

by Javid Pasha |

స్మార్ట్ మాస్ బ్రిక్స్ అందుబాటులోకి రావడంవల్ల పట్టణ వాయు కాలుష్యం తగ్గుతుంది. ఎందుకంటే ఇంటి నిర్మాణంలో ఉండే ఈ మెటీరియల్ పొల్యూటెంట్స్‌ను గ్రహిస్తుంది.

ఇండ్ల నిర్మాణానికి గడ్డిపొర ఇటుకలు.. ఎకో ఫ్రెండ్లీ Smart Moss Bricksను డెవలప్ చేసిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం నిర్మాణ రంగంలో సిమెంట్, ఇనుము, స్టీల్, ఉక్కు వంటివి ఉపయోగిస్తున్నారు. అయితే మారుతున్న పర్యావరణం, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల నడుమ ఈ ఆధునిక ఇండ్ల నిర్మాణ మెటీరియల్ మరింత వేడిని ప్రేరేపించేలా కూడా ఉంటోంది. చల్లదనానికి బదులుగా అధిక ఉష్ణోగ్రతలను గ్రహించడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఏసీలు, కూలర్లు వాడకుండా ఉండలేని పరిస్థితులు ఉంటున్నాయి. కాగా ఇటీవలె ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కనుగొన్నది జపాన్ దేశంలోని ఒక స్టార్టప్. ఇంటిని చల్లగా ఉంచేందుకు స్మార్ట్ మాస్ బ్రిక్స్(Smart Moss Bricks) అనే మెటీరియల్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఒక విధమైన గడ్డి(grass) పొరలుగా పేర్కొనవచ్చు. సాధారణ ఇటుకల కంటే భిన్నంగా ఉండటంతోపాటు ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది.

‘స్మార్ట్ బ్రిక్స్’ అని పిలిచే లివింగ్ బిల్డింగ్ మెటరీయల్స్ (Living building materials) ఇండ్లకు ఉపయోగించడం పర్యావరణ హితమే కాకుండా, అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి కేవలం గోడలను బలపరచడమే కాకుండా పట్టణ వాయు కాలుష్యాన్ని గ్రహించడం, తాజా ఆక్సిజన్(Producing fresh oxygen)ను ఉత్పత్తి చేయడం, చుట్టు పక్కల ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించడం వంటి అద్భుతమైన పనులు చేస్తాయి. ఈ ప్రక్రియలో ఒక్క వాట్ విద్యుత్ కూడా అవసరం ఉండదు. కాగా జీవశాస్త్రం, స్థిరమైన డిజైన్ మిశ్రమం(A blend of biology and sustainable design) అయిన ఈ టెక్నాలజీ పట్టణాలను ‘బ్రీతింగ్ లివింగ్ ఆర్కిటెక్చర్‌’గా మార్చగలదు అంటున్నారు నిపుణులు.

ప్రత్యేకతలు.. ప్రయోజనాలు

*జపాన్ నిపుణుల డెవలప్ చేసిన స్మార్ట్ మాస్ బ్రిక్స్‌లో స్పెషలైజ్డ్ మాస్ స్పీసెస్ ఉంటాయి. ఇవి పొరస్ (porous), అలాగే తేమను నిలపుకుంటుంది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతలు, వేడి కారణంగా నగర పరిస్థితుల్లో మాస్‌ను అంటే గడ్డిపొరలను పెరిగేలా చేస్తుంది. గాలి నుంచి తేమను గ్రహించి, పార్టిక్యులేటర్ మ్యాటర్(కణాలు)ను పట్టుకుంది. ఫలితంగా గోడలు పర్యావరణ హితమైన గార్డన్‌లుగా మారుతాయి.

*స్మార్ట్ మాస్ బ్రిక్స్ అందుబాటులోకి రావడంవల్ల పట్టణ వాయు కాలుష్యం తగ్గుతుంది. ఎందుకంటే ఇంటి నిర్మాణంలో ఉండే ఈ మెటీరియల్ పొల్యూటెంట్స్‌ను గ్రహిస్తుంది. అలాగే ఫొటో సింథెసిస్ ద్వారా తాజా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. వాయు నాణ్యతను మెరుగు పరుస్తుంది. రోజువారీగా తేమను గ్రహిస్తూ ఆవిరిని ప్రేరేపించడం (evaporation) ద్వారా చుట్టు పక్కల గాలిని చల్లబరుస్తుంది. అంటే ఇది నేచురల్ ఎయిర్ కండిషనర్ మాదిరి పనిచేసి పట్టణ వేడిని తగ్గిస్తుంది. ఈ ఆవిష్కరణ ప్రధానంగా డచ్ (Netherlands) స్టార్టప్ Respyre (gorespyre.com) ద్వారా అభివృద్ధి చేయబడినప్పటికీ, జపాన్‌లో దీనిని ఉపయోగించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కాగా ఇప్పుడైతే వాణిజ్య పరంగా అందుబాటులో లేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. Link

Next Story