14 ఏళ్లలో 4,500 స్మోక్ బ్రేక్స్.. 9 లక్షలు ఫైన్ వేసిన జపనీస్ కంపెనీ

by Disha Web Desk 10 |
14 ఏళ్లలో 4,500 స్మోక్ బ్రేక్స్..  9 లక్షలు ఫైన్ వేసిన జపనీస్ కంపెనీ
X

దిశ, ఫీచర్స్ : మీరు చైన్ స్మోకరా? ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో దమ్ముకొట్టేందుకు ఎక్కువసార్లు బ్రేక్ తీసుకుంటున్నారా? అయితే ఇది మిమ్మల్ని నిరాశ పరిచే విషయం. అదేంటంటే.. జపనీస్ అవుట్‌లెట్ ది మైనిచి నివేదిక ప్రకారం.. ఒక జపనీస్ కంపెనీలో పనిచేస్తున్న 61 ఏళ్ల సివిల్ సర్వెంట్ తన 14 సంవత్సరాల సర్వీసులో 4,500 సార్లు సిగరెట్ తాగేందుకు పని ఎగ్గొట్టి మరీ బ్రేక్ తీసుకున్నాడట. దీనికి గాను సదరు కంపెనీ అతనికి రూ. 8.94 లక్షలు (1.44 మిలియన్లు) ఫైన్ విధించింది. అంతకుముందు అతన్ని, అతనితోపాటు దమ్ముకొట్టే మరికొందరిని కంపెనీ అనేకసార్లు హెచ్చరించింది. ఆరునెలలపాటు జీతంలో కోత విధించింది. అయినా ఏమాత్రం మార్పురాకపోవడంతో జరిమానా విధించింది. ప్రపంచంలోని ధూమపాన నిషేధ చట్టాలు అమలులో ఉన్నాయి. మనదేశంలో కూడా ఆఫీసులు, ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో, జనసమూహంలో, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టరీత్యా నేరం.

Also Read..

Thati Bellam: తాటి బెల్లం వల్ల ఉపయోగాలేంటో తెలుసా?



Next Story

Most Viewed