- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : గంటకు 120 భోజనాలను రెడీ చేయగల రోబో.. సాంకేతిక నిపుణుల సరికొత్త ఆవిష్కరణ
జర్మన్ సాంకేతిక శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన CA-1 అనేది పూర్తిగా ఆటోమేటిక్ రోబోటిక్ కిచెన్. ఇది ఏఐ ఆధారిత ఆటోనమస్ రోబోటిక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అనేక రంగాల్లో, రకరకాల పనులకు ఏఐ ఆధారిత రోబోట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో, ఆరోగ్య రంగంలో, ఆథిత్య రంగంలో, సాంకేతిక రంగంలో ఇప్పటికే వీటి హవా నడుస్తోంది. ఇక ఇంటి పనుల్లో, వంటగదుల్లో సహాయం చేయగల హ్యూమనాయిడ్ రోబోలను సైతం పలువురు ఉపయోగించుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా జర్మనీకి చెందిన Circus SE అనే కంపెనీ Circus Autonomy One ( CA-1 ) అనే ఒక సరికొత్త రోబోను తయారు చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఒకేసారి 20 మందికి భోజనాలు సిద్ధం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంతకీ దాని వల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.
మానవ అవసరం లేకుండానే
జర్మన్ సాంకేతిక శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన CA-1 అనేది పూర్తిగా ఆటోమేటిక్ రోబోటిక్ కిచెన్. ఇది ఏఐ ఆధారిత ఆటోనమస్ రోబోటిక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంటే ఒక విధంగా దీనిని వంట మనుషుల(Human chefs) అవసరం లేకుండానేనే పూర్తి రెస్టారెంట్‌ను భర్తీ చేయగల కాంపాక్ట్ యూనిట్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది ఉండే ఇండ్లల్లో, ఆఫీసు క్యాంటీన్లలో, హోటల్స్‌లలో ఉపయోగించుకోవడంవల్ల వంట చేయడం, ప్లేట్లు శుభ్ర పర్చడం వంటి పనులన్నీ ఆటోమేటిగ్గా చేసేస్తుంది. విషయం ఏంటంటే ఇది మనుషులకంటే కూడా వేగంగా వంట పనులను చేయగలదు. గంటకు సుమారు 120 డిష్‌లను ప్రిపేర్ చేస్తుందని హాంబర్గ్, జర్మనీకి చెందిన స్టార్టప్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సరికొత్త ఏఐ రోబోటిక్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌తో ఫుడ్ సర్వీస్‌ను మరింత సమర్థవంతంగా మార్చడానికి ఉపయోగపడుతందని అంటున్నారు.
మూడు నిమిషాల్లోనే డిష్ రెడీ..
సీఏ-1 అనే ఈ సరికొత్త డ్యూయల్ రోబోటిక్ ఆర్మ్స్, స్మార్ట్ ఇంగ్రీడియెంట్ స్టోరేజ్, అలాగే కంప్యూటర్ విజన్ సాంకేతికతలతో రెస్టారెంట్ నాణ్యత గల భోజనాన్ని కేవలం 3-4 నిమిషాల్లో తయారు చేస్తుంది. ఇదంతా మనిషి అవసరం లేకుండానే చేసేస్తుంది. జస్ట్ కేవలం రోజుకు 1 గంట మానవ పర్యవేక్షణ మాత్రమే అవసరం. జర్మన్‌లోని పెద్ద పెద్ద హోటల్స్‌లో దీనిని ఉపయోగించుకోవడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇక కస్టమర్లు టచ్‌స్క్రీన్ ద్వారా ఆర్డర్ చేస్తే, హీటెడ్ పికప్ స్లాట్‌ల నుంచి వేడి వేడి ఆహారం వరకు అన్నీ రెడీ చేసి పెడుతుంది. ఈ రోబో.
మరికొన్ని ఉపయోగాలు
Circus Autonomy One ( CA-1 ) రోబో ఉపయోగాల విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో లేబర్ ఖర్చులను 95% తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కచ్చితమైన పోర్షన్ కంట్రోల్‌తో ఫుడ్ వేస్ట్‌ను తగ్గిస్తుంది. అలాగే జర్మనీ సూపర్‌మార్కెట్‌లలో “Fresh & Smart” బ్రాండ్ కింద ఇప్పటికే అమలులోకి వచ్చిన ఈ సిస్టమ్ అనేక విధాలుగా సహాయపడుతోంది. ఇక ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, ఆఫీసులు, వివిధ ఈవెంట్లలో దీని సేవలు ఉపయోగించుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. Link






