సైన్యంలో పనిచేసిన వ్యక్తి కేజ్ ఫిష్ ఫార్మింగ్లో అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాడు

by Daayi Srishailam |

మిస్టర్ చేపల రత్న

సైన్యంలో పనిచేసిన వ్యక్తి కేజ్ ఫిష్ ఫార్మింగ్లో  అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాడు
X

దిశ, ఫీచర్స్: అతడు ఐదేళ్ల పాటు సైన్యంలో పనిచేసిన వ్యక్తి కేజ్ ఫిష్ ఫార్మింగ్లో అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాడు. కేరళలోని కన్నూరు జిల్లా పరప్రం అనే చిన్న గ్రామంలో జన్మించిన దినిల్ ప్రసాద్ ఐదేళ్లపాటు భారత సైన్యంలో పనిచేశాడు. సైన్యం నుంచి బయటకొచ్చిన తర్వాత కేరళలోని సమృద్ధమైన నీట వనరులను చూసి.. స్థానికంగా మత్స్యసాగు చేయాలనే ఆలోచనకు ప్రేరణ పొందాడు. ఒక మహిళ కేజ్ ఫిష్ ఫార్మింగ్‌లో విజయం సాధించిన వీడియో అతడిని ఆలోచింపజేసింది.

కేజ్ ఫిష్ ఫార్మింగ్

కేరళలో అరేబియా సముద్రం, 44 నదులున్నాయి. వీటిని సద్వినియోగం చేస్తే ఉపాధి, ఆదాయం సృష్టింవచ్చు అని దినిల్ గ్రహించాడు. కేరళ రోజువారి మత్స్య వినియోగం 1,742 టన్నులు. కాగా రాష్ట్రానికి 2,281 టన్నులు అవసరం. దీనివల్ల 539 టన్నుల చేపలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దిగుమతి చేపలు ఖరీదైనవి. కొన్నిసార్లు రసాయనాలతో కలుషితమై ఉంటాయి. ఈ అవసరాన్ని స్థానికంగా తీర్చాలనే లక్ష్యంతో దినిల్ కొచ్చిలోని "సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్" సహాయం తీసుకున్నాడు. కేజ్ ఫిష్ ఫార్మింగ్ దీనికి స్థిరమైన పరిష్కారంగా భావించాడు.

మొదటి కేజ్ నిర్వహణ

కేజ్ ఫిష్ ఫార్మింగ్ అనేది నదులు.. సముద్రాలు వంటి సహజ నీటి వనరుల్లో చేపలను నియంత్రిత వాతావరణంలో పెంచే పద్ధతి. ఈ కేజ్‌లు జీఐ లేదా పీవీసీ పైపులు.. నెట్‌‌‌‌లు.. తాళ్లతో నిర్మించబడతాయి. నీటి ప్రవాహం ద్వారా చేపలకు ఆక్సీజన్.. పోషకాలు అందుతాయి. ఈ పద్ధతి సహజ వాతావరణాన్ని అనుకరిస్తూ.. రైతులకు ఎక్కువ నియంత్రణ.. ప్రెడేటర్ల నుంచి రక్షణను అందిస్తుంది. దినిల్.. అనంది నదిలో మొదటి కేజ్‌లను ఏరర్పాటు చేశాడు. అలా ఏడు కేజ్‌లు నిర్వహిస్తున్నాడు. ప్రతీ కేజ్ 4 మీటర్ల వెడల్పు.. 2.5 మీటర్ల లోతు కలిగి ఉంటుంది.

శ్రమంతా నీటిపాలు

దినిల్ కేజ్ ఫిష్ ఫార్మింగ్‌లో పర్ల్ స్పాట్.. ఆసియన్ సీ బాస్.. కలంజీ.. రెడ్ స్నాపర్ వంటి చేపలను పెంచుతున్నాడు. ఇవి కిలో రూ.500 ధరకు అమ్ముడవుతాయి. ఒకొక్క కేజ్ నుంచి 150-200 కిలోల దిగుబడి వస్తుంది. ఆరు నుంచి ఏడు నెలల ఫీడింగ్ సైకిల్ తర్వాత అంచనా వేయబడుతుంది. 2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. దినిల్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. అతడి కష్టమంతా నీటిలో కలిసిపోయింది. అప్పులతో ప్రారంభించిన వ్యాపారం ఆర్థికభారంగా మారింది. ఈ విపత్తును ఒక అవకాశంగా మల్చుకున్నాడు. ఆరోగ్యకరమైన చేపల స్టాక్‌ను ఎంచుకోవడం.. సరైన సమయంలో సాగు చేయడం వంటివెన్నో తెలుసుకున్నాడు.

స్థానికంగా ఉపాధి..

విపత్తు నుంచి పాఠాలు నేర్చుకొని తన వ్యాపారాన్ని పునర్మించుకున్నాడు దినిల్. దాంతోపాటు మరో 50 మంది రైతులకు సహాయం చేశాడు. కోజికోడ్‌కు చెందిర అర్పిత్ బైజు దినిల్ సహాయంతో రెండు కేజ్‌లతో మత్స్యసాగు ప్రారంభించాడు. దినిల్ అధ్యయనం చేసి గుర్తించింది ఏంటంటే.. సాంప్రదాయ మత్స్య సాగుతో పోలిస్తే కేజ్ ఫిష్ ఫార్మింగ్ వల్ల సహజ నీటి వనరులను ఉపయోగించుకోవచ్చు. అంటే చెరువులను నిర్మించే అవసరం లేదు. రోగాలను తగ్గించి దిగుబడి నాణ్యత పెంచవచ్చు. అవసరాన్ని బట్టి కేజ్‌లను విస్తరించవచ్చు లేదా స్థానం మార్చవచ్చు. స్థానికంగా కొందరికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.

స్థిరమైన మత్స్యసాగు

కేజ్ ఫిష్ ఫార్మింగ్‌లో దినిల్ సాధించి ఫలితాలకు మంచి ప్రోత్సాహకం లభించింది. 2022లో ప్రభుత్వం నుంచి రూ.1 లక్ష నగదు బహుమతి అందుకున్నాడు. కేజ్ ఫిష్ ఫార్మింగ్‌తో పాటు దినిల్ 7,000 పర్ల్ స్పాట్ చేపలను ఏడు కేజ్‌లలో పెంచుతూ సీడ్ ప్రొడక్షన్ యూనిట్.. మస్సెల్ ఫార్మింగ్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. అంతేగాక మలబార్ ప్రాంతంలో 75 కేజ్ కల్చర్ యూనిట్లను స్థాపించడంలో సలహాదారుగా పనిచేశాడు. మొత్తానికి సైన్యం నుంచి స్వల్ప వనరులతో వ్యవసాయ వ్యాపారిగా మారింది దినిల్ స్ఫూర్తిదాయక ప్రయాణం. స్థానిక రైతులకు మార్గదర్శనం చేస్తూ స్థిరమైన మత్స్యసాగును ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Next Story