మ‌స‌లా దోశ ఇలా తినాలంట‌..! ఎందుక‌లా..? (వీడియో)

by Disha Web Desk 20 |
మ‌స‌లా దోశ ఇలా తినాలంట‌..! ఎందుక‌లా..? (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః దోశ‌ల్లో ఎన్ని రకాలున్నా మ‌సాలా దోశ‌కున్న ప్ర‌త్యేక‌తే వేరు. హాట్ స్పైసీ ఆలూ మ‌సాలాతో చెట్నీ నంజుకుతింటుంటే.. సంబార్‌లో ముంచి నోటికి అందిస్తుంటూ.. 'ఆహా..! ఏమి రుచి' అన‌క త‌ప్ప‌దు. అలాంటి మ‌సాలా దోశ‌ను ఇలా కూడా తినొచ్చంటూ ఓ ఫుడ్ బ్లాగ‌ర్ ఒక వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. అయితే, ద‌క్షిణ‌ భారతీయ‌ వంటకాల్లో ప్ర‌ధాన‌మైన దోసను మ‌న‌మైతే హాయిగా ఆశ్వాదిస్తాము గానీ విదేశీలుకు, దోస అంత‌గా అల‌వాటు లేనివారికి తిన‌డం కాస్త క‌ష్ట‌మేన‌ట‌. ఇక‌, ఇంట్లో అయితే ఎలాగైనా తినొచ్చుకానీ, అధికారిక స‌మావేశాల్లో, ఖ‌రీదైన టేబుళ్ల‌పై తినేట‌ప్పుడు కొన్ని తెచ్చిపెట్టుకున్న మ‌ర్యాద‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి కూడా. అలాంటి చోట మ‌సాలా దోస‌ను ఇలా తినొచ్చ‌ని ఫుడ్ బ్లాగర్ ఈ ఐడియా ఇచ్చారు. 'మసాలా దోస తినడానికి సరైన మార్గం' ఇదే అంటూ ఫుడ్ స్టైలిస్ట్, బ్లాగర్ అయిన‌ మాన్సీ శివ రాఠీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ @_pizzandpie_లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసారు. దీనికి నెట్టింట్లో విభిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. 'సూప‌ర్ టెక్నిక్‌', మ‌సాలా దోశ ఇలా తినాల‌ని నాకు ఇప్పుడే తెలిసింది' అని కొంద‌రంటుంటే, 'దోస‌ను ఫోర్క్‌తో తిన‌డ‌మేంటీ విడ్డూరం కాక‌పోతే' అంటూ ఇంకొంద‌రు విసుక్కుంటున్నారు. స‌ర‌దా చర్చను రేకెత్తించిన ఈ వీడియోకు ఇప్ప‌టి వ‌ర‌కూ 34.9k లైక్‌లు, 474k వీక్షణలు, వంద‌ల్లో కామెంట్ల వ‌చ్చాయి.



Next Story