- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తుడి విచిత్ర మొక్కు.. బతికి ఉండగానే అంతిమయాత్ర!
by Chintha Aamani |
సాధారణగా దేవుడికి మొక్కు చెల్లించాలంటే జంతువులను బలి ఇవ్వడం మనం కామన్‌గా చూస్తుంటాం. కానీ తమిళనాడులో ఓ వ్యక్తి వింత మొక్కును

X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణగా దేవుడికి మొక్కు చెల్లించాలంటే జంతువులను బలి ఇవ్వడం మనం కామన్‌గా చూస్తుంటాం. కానీ తమిళనాడులో ఓ వ్యక్తి వింత మొక్కును చెల్లించుకున్నాడు. తమిళనాడులో సెలం జిల్లా కొండలం పట్టుకి చెందిన జయమణి అనే వ్యక్తి తాను బతికి ఉండగానే అంతిమయాత్ర నిర్వహించాడు. తాను కోరుకున్న ప్రతీదినెరవేరడంతో మారియమ్మన్ ఆలయంలో అమ్మవారి మొక్కు కోసం ఇలా చేసినట్లు సమాచారం. తోలుత కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన తర్వాత ఊరంతా సంతాప పోస్టర్లు వేయించి.. పాడేపై శవంలా పడుకొని ఊరంతా తిప్పించుకొని శ్వశానంలో దిగాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చచ్చిన శవంలా శరీరంలో కదలిక లేకుండా ఉండి.. ఊరంతా జరిగిన తన అంతిమయాత్రను చూసుకున్నాడు. ఇదేం మొక్కు సామి అని కొందరు పెదవి విరవగా.. మరికొందరు ఇది వెర్రితనం అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






