- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : పొట్టిదే కానీ.. గయ్యాళిగంపరోయ్..! ఏం చేసిందో మీరే చూడండి!!
Viral video : పొట్టిదే కానీ.. గయ్యాళిగంపరోయ్..! ఏం చేసిందో మీరే చూడండి!!

దిశ, ఫీచర్స్ : పిల్లలేం చేసినా మద్దు ముద్దుగానే అనిపిస్తుంది. కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్లు చేసే చిలిపి చేష్టలు చిరాకెత్తిస్తుంటాయి కూడా. ఇక అప్పుడప్పుడూ చేసే కొన్ని పనులైతే నవ్వు తెప్పించడమో, కోపం తెప్పించడమో, హాస్యం పండించడమో చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియోనే ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో తల్లి పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి ఏం చేసిందో చూస్తే.. వావ్.. అనాల్సిందే!
వైరల్ వీడియో(Viral video) ప్రకారం.. ఓ మహిళ నాలుగేండ్లలోపు వయసు గల తన చిన్నారి కూతురుతో ఇంట్లో కూర్చొని ఉంటుంది. పక్కన రెండు బుట్టలు (టబ్స్) కూడా ఉన్నాయి. అందులో ఒకటి వెదరుతో చేసింది కాగా, ఇంకోటి ప్లాస్టిక్ టబ్. ఆ రెండింటిలో కూడా వంటలో వాడేందుకు తెచ్చిన చింత చిగురు కనిపిస్తోంది. అయితే ఒక బుట్టలోంచి మంచిగా ఉన్న చింత చిగురును తీసి మరో బుట్టలో వేసే పనిలో తల్లి బిజీ నిమగ్నమై ఉండగా.. పక్కనే ఉన్న చిన్న పాప కూడా తల్లిలాగే చేయడానికి ట్రై చేస్తోంది. ఇది గమనించిన తల్లి అనవసరంగా పాడు చేస్తుందనో, పడేస్తుందనో ఊహించి అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఎంతకీ వినదు ఆ చిన్నారి. పైగా బుట్టలో చేయి పెట్టడానికి ప్రయత్నిస్తుంది. దీంతో తల్లి ఎన్నిసార్లు ఆ పాప చేయి తీసి వేసినా మొండిగా మళ్లీ మళ్లీ అదే చేస్తుంది. ఇక ఆ తల్లీ కూతుళ్ల మధ్య జరిగిన సీన్ చూస్తే ఎవరైనా ఓర్నీ ఆ పిల్ల పొట్టిదే కానీ.. గట్స్ ఉన్న గట్టిది.. గయ్యాళి గంప అని ఆశ్చర్యపోక మానరు. పైగా తల్లి అరిస్తే ఆ చిన్నారి కూడా అరుస్తూ.. ఏడుస్తూ.. బుట్టలోంచి చింత చిగురు తీయడానికే ప్రయత్నిస్తుంది తప్ప భయపడి ఊరుకోలేదు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






