Screen effect : పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగితే.. చదువులో స్కోర్లు తగ్గుతాయ్..!!

by Javid Pasha |

పిల్లలు కేటాయించే ప్రతీ అదనపు గంట స్క్రీన్ టైమ్ వారిలో రీడింగ్, గ్రేడింగ్ స్కోర్లను తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Screen effect : పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగితే.. చదువులో స్కోర్లు తగ్గుతాయ్..!!
X

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు, టీవీ, ఫోన్, వీడియోగేమ్స్, పలు ఇతర డిజిటల్ మీడియా వేదికల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? కిండర్‌గార్టెన్ ముందు గంటల తరబడి స్క్రీన్ ముందు ఉంటున్నారా? అయితే చదువులో చాలా తక్కువ స్కోరు సాధించే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రీడింగ్ అండ్ మ్యాథమెటిక్స్‌లో ఇంకా వెనుకబడవచ్చునని పేర్కొ్ంటున్నాయి. అధ్యయనంలో భాగంగా కెనడా దేశంలోని టొరొంటోలో గల ది హాస్పిటల్ ఫర్ సిక్ చిల్ట్రన్

గ్రేడింగ్ స్కోర్లపై ప్రభావం

కెనడాలో దేశంలోని టొరొంటోలో గల ది హాస్పిటల్ ఫర్ సిక్ చిల్డ్రన్(Sickkids) పరిశోధకులు 2008 నుంచి 2023 వరకు 15 సంవత్సరాల పాటు 3,300కు పైగా పిల్లల స్క్రీన్ సమయాన్ని ట్రాక్ చేసి, చదువులో వారి ప్రతిభను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు టీవీ, డిజిటల్ మీడియా, వీడియో గేమ్స్ వంటి వాటికోసం పిల్లలు కేటాయించే ప్రతీ అదనపు గంట స్క్రీన్ టైమ్.. గ్రేడ్ 3, గ్రేడ్ 6లో రీడింగ్, మ్యాథ్ స్కోర్లను తగ్గిస్తుందని కనుగొన్నారు. అంతేకాదు ప్రతీ అదనపు గంటకు ఉన్నత స్థాయి సాధించే అవకాశం సుమారు 9-10% తగ్గుతుందని కనుగొన్నారు. పేరెంట్స్ రిపోర్ట్ చేసిన స్క్రీన్ టైమ్‌ను ఒంటారియో స్టాండర్డైజ్డ్ టెస్ట్ (EQAO) స్కోర్లతో లింక్ చేసిన పరిశోధకులు ఈ విధమైన నిర్ధారణకు వచ్చారు.

లెర్నింగ్ స్కిల్స్ తగ్గుతాయ్..

అధ్యయనం ప్రకారం.. సగటున 5-6 ఏండ్ల వయసుగల పిల్లల్లో చాలామంది రోజుకు 90 నిమిషాలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. అధిక స్క్రీన్ టైమ్ మెదడు నిర్మాణాన్ని మార్చి, జ్ఞాపకశక్తిని, లెర్నింగ్‌ స్కిల్స్‌ను ప్రభావితం చేస్తుందని, ఆడుకోవడం, నిద్ర, సోషల్ ఇంటరాక్షన్‌లను తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా అమ్మాయిల్లో వీడియో గేమ్స్.. రీడింగ్, మ్యాథ్ స్కోర్లను మరింత తగ్గిస్తాయి. కాబట్టి పిల్లలు స్క్రీన్‌ల ముందు గడిపే సమయాన్ని పేరెంట్స్ నియంత్రిచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ సమయం, మంచి కంటెంట్, తల్లిదండ్రులతో కలిసి చూడటం (Co-viewing) ముఖ్యమని సూచిస్తున్నారు. ఆడుకోవడం, మాట్లాడటం, పుస్తకాలు చదవడం వంటివి మెదడు అభివృద్ధికి బలమైన పునాది అని నొక్కి చెబుతున్నారు. పీడియాట్రిషియన్లు సైతం వీటికి బదులుగా ఆరోగ్యకరమైన రొటీన్‌లను ప్రోత్సహించాలని సిఫారసు చేస్తున్నారు.

Next Story