- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్లాస్‌మెట్‌కి క్యాన్సర్ వస్తే మిగతా విద్యార్థులంతా ఏం చేశారో చూడండి
ఆ విద్యార్థి కోలుకొని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నారు. the most heartwarming surprise from his classmates.

దిశ, వెబ్‌డెస్క్ః జీవితంలో ప్రేరణ ఇచ్చే అంశాలు చాలానే ఉంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోరు చాలా మంది. ఈ వీడియో కూడా సరిగ్గా అలాంటి ప్రేరణే ఇస్తుంది. ఈ క్లిప్ ఖచ్చితంగా మీ ముఖంలో చిరునవ్వు తెస్తుంది. ఇంటర్నెట్‌లో అందర్ని హత్తుకుంటున్న ఈ వీడియోలో క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక స్కూల్ విద్యార్థి తన తోటి క్లాస్‌మెట్స్ నుండి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే అనుభవాన్ని పొందుతాడు. వారంతా కలిసి చేసిన చర్య కృంగిపోయిన అతని ముఖంలో చిరునవ్వును, అంతకుమించిన ధైర్యాన్ని తెచ్చినట్లు కనిపిస్తుంది. ఇందులో అతడి సహవిద్యార్థులు తన పరిస్థితికి సంఘీభావంగా తలలు గుండు కొట్టించుకుంటూ ఆశ్చర్యపరుస్తారు. ఈ వైరల్ వీడియో గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా, మిలియన్ వ్యూవ్స్‌తో నెటిజనులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. అంతా, ఆ విద్యార్థి కోలుకొని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నారు.






