Illegal Affairs : ఆ వయసులో మరో వ్యక్తితో ఎఫైర్..! 96 ఏండ్ల వయసులో భార్యకు విడాకులిచ్చిన భర్త.. !!

by Javid Pasha |   (  Updated:2025-08-14 10:27:09  IST  )

ఓ రోజు భర్త అంటోనియో సి పాత డ్రాయర్‌లో ఉన్న వస్తువులను చెక్ చేస్తుండగా.. తన భార్య రోసాని 1940లో ఒక వ్యక్తికి ప్రేమ లేఖలు రాసినట్లు, అతనితో ఎఫైర్ నడిపినట్లు తెలియజేసే ఆధారాలు దొరికాయి.

Illegal Affairs : ఆ వయసులో మరో వ్యక్తితో ఎఫైర్..! 96 ఏండ్ల వయసులో భార్యకు విడాకులిచ్చిన భర్త.. !!
X

దిశ, ఫీచర్స్ : కొన్ని విషయాలు వినడానికి వింతగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. అదే సందర్భంలో సమాజంలోని లొసుగులను, మనుషుల్లోని ఆలోచన తీరును కూడా తెలియజేస్తాయి. మంచో చెడో ఏదో ఒక మెసేజ్ సైతం అందిస్తాయి. ఆ కోవకు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటలీకి చెందిన అంటోనియో సి (Antonio C) అనే పేరుగల 99 ఏండ్ల వృద్ధుడు, రోసా సి (Rosa C) అనే పేరుగల 96 ఏండ్ల వృద్ధురాలు భార్యా భర్తలు. 77 ఏండ్ల వివాహ జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే తాజాగా భర్త అంటోనియో తన భార్యతో విడాకులు కోరాడు. కారణం.. ఆమెకు వేరొకరితో ఎఫైర్ (Affair with someone else) ఉండటమే! ఈ వయసులో ఇదేం పోయే కాలం.. అయినా ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఏం లేదు. ఓ రోజు భర్త అంటోనియో సి పాత డ్రాయర్‌లో ఉన్న వస్తువులను చెక్ చేస్తుండగా.. తన భార్య రోసాని 1940లో ఒక వ్యక్తికి ప్రేమ లేఖలు రాసినట్లు, అతనితో ఎఫైర్ నడిపినట్లు తెలియజేసే ఆధారాలు దొరికాయి. దీంతో ఆమెను నిలదీయగా అప్పట్లో అది నిజమేనని ఒప్పుకుంది. అందుకు గాను భర్త విడాకులు కోరగా వద్దని బతిమాలింది. కానీ అంటోనియో మాత్రం వినిపించుకోకుండా విడాకులు ఇచ్చేశాడు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీగా రియాక్ట్ అవుతున్నారు. Link

Next Story