ఏఐ‌తో పెళ్లి కావాలి..! 80% Gen Zs‌ ఫీలింగ్ అదేనంటున్న ఓ అధ్యయనం..!!

by Javid Pasha |

ఏఐ‌తో పెళ్లి కావాలి..! 80% Gen Zs‌ ఫీలింగ్ అదేనంటున్న ఓ అధ్యయనం..!!

ఏఐ‌తో పెళ్లి కావాలి..! 80% Gen Zs‌ ఫీలింగ్ అదేనంటున్న ఓ అధ్యయనం..!!
X

దిశ, ఫీచర్స్ : ఏఐ రాకతో మానవాళికి మేలు జరుగుతున్నప్పటికీ, కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని, ఆందోళనను సైతం కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఏఐ చాట్‌‌బాట్స్ ఒకటి. సంబంధాలు, డేటింగ్ వంటి విషయాల్లోనూ ఇవి యువతను, ముఖ్యంగా Gen Zs‌ను ప్రభావితం చేస్తున్నాయని జోయ్ ఏఐ అనే చాట్‌బాట్ కంపెనీ 2,000 మందిపై నిర్వహించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

జోయ్ రీసెంట్ స్టడీ ప్రకారం.. జెన్ జీ(1997-2012 మధ్య జన్మించినవారు)లలో 80% మంది ఏఐ(Artificial Intelligence) చాట్‌బాట్‌‌ను వివాహం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. 83% మంది ఏఐ గర్ల్/ బాయ్ ఫ్రెండ్‌తో లోతైన భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చుకోగలమని నమ్ముతున్నారు. యువతలో పెరిగిపోతున్న ఈ ధోరణికి సదరు కంపెనీ ‘ఏఐ-లేషన్‌షిప్స్(AI-lationships)’ అనే కొత్త పదాన్ని క్రియేట్ చేసింది. ఇది వాస్తవ ప్రపంచంలో డేటింగ్ అనేది అధిక భావోద్వేగ ప్రయత్నాన్ని, ఇబ్బందులను తెలియజేస్తున్నదని కూడా అధ్యయనం పేర్కొన్నది.

ఏఐతో వివాహం, రిలేషన్‌షిప్ వంటి ధోరణి Gen Zsలో పెరిగిపోవడం మానవ సంబంధాల విషయంలో లోతైన సంక్షోభాన్ని సూచిస్తున్నదని డిజిటల్ సోషియాలజిస్ట్ జూలీ ఆల్బైట్ అంటున్నారు. కాగా ఏఐ వాయిస్ సహచరులు ఒత్తిడి రహిత సౌకర్యాన్ని అందించడంవల్ల యువత ఆ కోణంలో ఆలోచిస్తోందని, కానీ.. ఎంతైనా ఇది మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కానేరదని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అధ్యయనంలో భాగంగా కొందరిని ప్రశ్నించినప్పుడు ‘స్ట్రెస్ ఫ్రీ అండ్ జడ్జ్ మెంట్ ఫ్రీ’ అనుభవాన్ని అందిస్తున్నందువల్ల ఏఐతో ప్రేమలో పడ్డట్లు కూడా కొందరు పేర్కొన్నారు. Link

Next Story