- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 గంటలే అవసరం లేదు.. 5 గంటలు నిద్రపోయినా ఆరోగ్యంగా ఉంటారు!
ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది కేవలం 4-5 గంటల నిద్రతో కూడా ఉత్సాహంగా ఉంటున్నారు

దిశ, ఫీచర్స్ : మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమనే విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెబుతుంటారు. కానీ UC San Francisco (UCSF) నిపుణుల పరిశోధన మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాన్ని వెల్లడించింది. కేవలం 4 నుంచి 5 గంటలు నిద్రపోయినా కొందరు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని తెలిపింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే ఇటువంటి అరుదైన లక్షణాన్ని కలిగి ఉంటున్నారని పేర్కొన్నది. ఆ వివరాలేమిటో చూద్దా పదండి!
ఒక్కరోజు సరిగ్గా నిద్రపట్టకపోతేనే మరుసటి రోజు మైండ్ పనిచేయదు కొందరికి. ఇది ఎల్లప్పుడూ కొనసాగితే మెమరీ లాస్, మూడ్ స్వింగ్స్, రోగనిరోధక శక్తి తగ్గడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం వంటివి పెరుగుతాయి. కానీ అరుదుగా కొందరిలో ఇలా జరగదు. ఎందుకంటే వీరిలో ఉండే ఒక అతిస్వల్ప జన్యు మార్పు (Mutation in the DEC2 gene) ఈ పరిస్థితిని మార్చివేస్తుంది. కాబట్టి ఇది కలిగి ఉన్నవారు కేవలం 4 నుంచి 5 గంటలు నిద్రపోయినా ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా ఎప్పటిలాగానే ఉత్సాహంగా ఉంటారు. ఇలాంటి వారిని నిపుణులు ‘షార్ట్ స్లీపర్స్’అని కూడా పిలుస్తున్నారు. DEC2 gene అనేది తక్కువ నిద్రకు కారణమైనప్పటికీ ఈ మార్పు శరీరంలో ఓరెక్సిన్ (wakefulness hormone) ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మెదడు నిద్రలో త్వరగా రికవరీ అవుతుంది. కాబట్టి 7 నుంచి 8 గంటలు నిద్రలేకున్నా మనిషి శక్తివంతంగా ఉండేలా ప్రేరేపిస్తుంది. ఇక జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా ఎప్పటిలాగానే సమర్థవంతంగా ఉంటాయి. నిజానికి ఈ అరుదైన జన్యు లక్షణం సదరు వ్యక్తులకు ఒక సూపర్ పవర్‌లాగా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. Link






