- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లగ్జరీ బ్రాండ్స్ కొనేవాళ్లల్లో పేదలే ఎక్కువ.. మార్కెట్ లాభాల్లో 75% ఆదాయం వీళ్లదే..
ధనవంతుల(అధిక ఆదాయ వర్గాల) కంటే పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే విలాస వస్తువులపై, ఖరీదైన బ్రాండ్ల కొనుగోళ్లపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

దిశ, ఫీచర్స్ : బాగా డబ్బున్నోళ్లు అవసరాల కోసం మస్తు ఖర్చు చేస్తారని, లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ అంత సీన్ లేదు అంటున్నాయి కొన్ని మార్కెట్ రీసెర్చింగ్ ఎనాలిసిస్ స్టడీస్. లగ్జరీ లైఫ్‌ను ఆస్వాదించడంలో, లగ్జరీ బ్రాండ్‌లను కొనుగోలు చేయడంలో అధిక ఆదాయం కలిగిన హై క్లాస్ పీపుల్ కంటే.. తక్కువ ఆదాయం కలిగిన లో క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే ముందుంటారని పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విలాస వస్తువులపై చేసే ఖర్చు, వచ్చే ఆదాయం 75% మధ్య, తక్కువ ఆదాయ వర్గాల వినియోగదారుల నుంచే వస్తోందని, ధనవంతులైన ఎలైట్ వర్గాల నుంచి ఇది రావడం లేదని చెబుతున్నాయి.
సోషల్ స్టేటస్ కోసం..
ధనవంతుల(అధిక ఆదాయ వర్గాల) కంటే పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే విలాస వస్తువులపై, ఖరీదైన బ్రాండ్ల కొనుగోళ్లపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే.. చాలా మంది షాపర్లు తమ సామాజిక గుర్తింపు (social identity), సోషల్ స్టేటస్, మానసిక సంతృప్తి (emotional satisfaction) కోసమే హై-ఎండ్ బ్రాండ్లు కొంటున్నారు. తక్కువ ఆదాయ వర్గాల్లోని ఈ విధమైన ఆసక్తే ప్రపంచ వ్యాప్తంగా మల్టీబిలియన్ డాలర్ల లగ్జరీ మార్కెట్‌ను నడిపిస్తోంది. ఉదాహరణకు మధ్యతరగతి వ్యక్తులు తమను ఉన్నత సమాజంలో భాగంగా చూపించుకోవడానికి డిజైనర్ బ్యాగ్స్, దుస్తులు, షూస్ వంటివి ఎంచుకుంటారు. ఇది వారికి సామాజిక ఆమోదం(Social acceptance), స్వీయ-విలువను (self-worth) పెంచుతుందని భావిస్తారు. ఈ ట్రెండ్ వినియోగదారుల ఆర్థిక నిర్ణయాలను ఎమోషనల్ ఫ్యాక్టర్లపై ఆధారపడేలా చేస్తుండటంతో లగ్జరీ బ్రాండ్లకు కొత్త మార్కెట్ అవకాశాలు తెరుస్తోంది. అందుకు తోడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ అవసరాలకోసం, డబ్బు సంపాదన కోసం బ్రాండ్ ఇమేజ్‌ను పర్సనల్ ఎక్స్‌ప్రెషన్‌కు కీలక భాగంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీలు, మిలీనియల్స్ మార్కెట్ ప్రయోజనాలకు ఆర్థిక వనరుగా మారుతు తమ నిజ జీవితంలో మాత్రం నష్టపోతున్నారు.
వారికి లాభం.. వీరికి నష్టం!
నిపుణులు ప్రకరాం.. వస్తు వినిమయ మార్కెట్ ఉచ్చులో పేదలు, మధ్య తరగి ప్రజలే చిక్కుకుంటున్నారు. ఎందుకంటే వీరు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను మెయింటైన్ చేయడానికి సేవింగ్స్, అలాగే ఎసెన్షియల్స్‌పై ఖర్చు తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్స్‌లో కూడా చాలామంది పేద, మధ్య తరగతి వారే ‘పర్ఫెక్ట్ లైఫ్’ చూపించుకోవడానికి లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు చేస్తున్నారు. అనేక భ్రమల్లో కూరుకుపోతున్నారు. ఇది లాంగ్-టర్మ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రభావితం చేస్తుంది. మొత్తంగా హై క్లాస్ పీపుల్ డబ్బున్నప్పటికీ బ్రాండ్ల కొనుగోళ్లలో పూర్ లైఫ్ స్టైల్ అనుసరిస్తుండగా, తక్కువ ఆదాయం కలిగిన మిడిల్ అండ్ లో క్లాస్ పీపుల్ మాత్రం బ్రాండ్ల కొనుగోళ్లలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తన్నారు. ఈ ట్రెండ్ లగ్జరీ మార్కెట్ డైనమిక్స్‌ను మార్చుతూ దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తున్నప్పటికీ, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడం లేదు. అందుకే లగ్జరీ లైఫ్ భ్రమల నుంచి మిడిల్ అండ్ లో క్లాస్ పీపుల్ బయటపడాలని, తమ జీవన ప్రమాణాలను, ఆర్థిక స్థితిని మెరుగు పర్చడంలో భాగంగా పొదుపు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.






