- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెస్పెక్ట్ ప్లీజ్..! 74% మంది పురుషుల ప్రధాన భావోద్వేగ అవసరం ఇదే..!
రెస్పెక్ట్ ప్లీజ్..! 74% మంది పురుషుల ప్రధాన భావోద్వేగ అవసరం ఇదే..!

దిశ, ఫీచర్స్ : పరస్పర గౌరవ మర్యాదలనేవి సహజ సిద్ధమైన మానవ ప్రవర్తనా లక్షణాలుగా అందరూ భావిస్తుంటారు. ఇవి కేవలం ఆనందాన్నే కాదు, మానసిక వికాసాన్ని కూడా కలిగిస్తాయని నిపుణులు చెబుతుంటారు. స్త్రీ, పురుషులందరికీ ఇది సమానంగా వర్తిస్తుంది. పైగా జీవితంలోని అనేక సందర్భాల్లో ‘రెస్పెక్ట్’ అనేది ఒక ప్రధాన భావోద్వేగ అవసరం(A core emotional need)గానూ పేర్కొంటారు. అయితే సైకాలజీ టుడేలో పబ్లిషైన ఒక అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. పురుషులు గౌరవం విషయంలో ఎలా భావిస్తున్నారో పరిశీలించగా.. చాలామంది గౌరవం పొందడాన్ని ముఖ్యమైన ఎమోషనల్ సపోర్ట్(Emotional support)గా భావిస్తున్నట్లు తేలింది. ఇక అగౌరం వంటి పరిస్థితుల్లో ఉండేకంటే ఒంటరితనాన్ని ఎంచుకోవడమే ఉత్తమంగా భావిస్తున్నారు.
అధ్యయనంలో భాగంగా డాక్టర్ ఎమర్సన్ ఎగ్గెరిచ్స్ అనే మానసిక నిపుణుడు 400 మంది పురుషులపై సర్వే నిర్వహించాడు. ఈ సందర్భంగా 74% మంది తాము గౌరవించబడాలని బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా గౌరవం లేని పరిస్థితుల్లో ఉండే కంటే ఒంటరితనాన్ని ఎంచుకోవడం ఉత్తమంగా భావిస్తున్నారు. ‘‘లవ్ అండ్ రెస్పెక్ట్’’ అనే తన పుస్తకంలో కూడా ఎమర్సన్ ఎగ్గెరిచ్స్ ఇది ప్రస్తావించాడు. పురుషులకు గౌరవం ప్రధాన భావోద్వేగ అవసరమని, స్త్రీలకు దాంతోపాటు ప్రేమ ప్రధాన భావోద్వేగ అవసరమని తెలిపాడు. గౌరవం లేని పరిస్థితులను అనుభవించడం వల్ల పురుషుల్లో మానసిక ఒత్తిడి(mental stress) పెరగడం, ఆత్మ విశ్వాసం తగ్గడం వంటివి సంభవించే అవకాశం ఉన్నాయని, ఇవి సంబంధాలలో కూడా సమస్యలకు దారితీస్తాయని అధ్యయనం పేర్కొన్నది. Link






