Youth Dreams : కలలో నువ్వే.. కళ్లల్లో నువ్వే.. ఊహల్లో తేలియాడుతున్న యువత

by Javid Pasha |

Youth Dreams : కలలో నువ్వే.. కళ్లల్లో నువ్వే.. ఊహల్లో తేలియాడుతున్న యువత

Youth Dreams : కలలో నువ్వే.. కళ్లల్లో నువ్వే.. ఊహల్లో తేలియాడుతున్న యువత
X

దిశ, ఫీచర్స్

‘‘కళ్లు మూసినా నువ్వే.. కళ్లు తెరిచినా నువ్వే..

కలలో నువ్వే.. కనుపాపల్లో నువ్వే..

ఆనందంలో నువ్వే.. ఆలోచనల్లో నువ్వే..’’

ఇదేదో కొద్ది మంది ప్రేమికుల విరహ వేదనే కాదిప్పుడు. వరల్డ్ వైడ్ యువతీ యువకుల మనో భావాలకు నిదర్శనం అంటోంది ఓ అధ్యయనం. యూఎస్ కేంద్రంగా సెర్టా స్టిమన్స్ బెడ్డింగ్ కోసం యువత మనసులోని మాటను తెలుసుకునేందుకు ఓ సంస్థ ఆ మధ్య పలువురు యువతీ యువకులను ప్రశ్నించింది. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయని ఆరాతీసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు అధ్యయనాన్ని ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొన్నారు.

పగలంతా వివిధ పనుల్లో నిమగ్నమవుతారు కాబట్టి రాత్రిపూట చక్కగా నిద్రపోవాలని అందరూ అనుకుంటారు. అయితే నిద్రపోయే ముందు ఎవరు ఏం ఆలోచిస్తారు? అధ్యయనంలో భాగంగా ఇదే విషయాన్ని 2000 మంది యువతీ యువకులతోపాటు పెద్దలను కూడా ప్రశ్నించారు నిపుణులు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. నిద్రపోయే ముందు ఓవరాల్‌గా 45 శాతం మంది మరుసటిరోజు తమ షెడ్యూల్ గురించి ఆలోచిస్తున్నారు. 44 శాతం మంది తమ పార్ట్‌నర్ గురించి, 36 శాతం మంది తమ వర్క్ గురించి ఆలోచిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. నిద్రలోకి జారుకునేముందు 61 శాతం జెన్‌జీ(Gen Z)లు మాత్రం చదువు, ఫ్యూచర్ కెరీర్‌తోపాటు అందమైన ఊహాలోకంలో విహరిస్తున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల వయసు నుంచి 36 ఏండ్ల వయసు వరకు యువత అబ్బాయిలైతే తమకు నచ్చిన అమ్మాయి గురించి ఆలోచించడం, అమ్మాయిలైతే అబ్బాయిల గురించి ఆలోచించడం వంటివి చేస్తున్నారు. పగటిపూట కూడా తమకు నచ్చిన అంశాలతోపాటు మనసుకు నచ్చిన ‘డ్రీమ్‌ గర్ల్.. డ్రీమ్ బాయ్’ ఊహల్లో విహరించే యువతీ యువకులే ఎక్కువగా ఉంటున్నాని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు చదువు, కెరీర్, ఫ్యూచర్ ప్లాన్స్ వంటివి కూడా ఆలోచిస్తున్నారట.

మిలీనియల్స్ (27 నుంచి 42 ఏళ్ల వయస్సు) విషయానికి వస్తే 56 శాతం మంది నిద్రపోయే ముందు గత రోజులో గడిపిన ఇష్టమైన క్షణాల గురించి ఆలోచిస్తున్నారు. 39 శాతం మంది Gen X (43 – 58) నిద్రకు ముందు మరుసటి రోజు గురించి ఆలోచించే అవకాశం కాస్త తక్కువ. వీరిలో ఓవరాల్‌గా 38 శాతం మంది మాత్రం తమ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు. నిద్ర అలవాట్ల విషయానికి వస్తే జనరేషనల్ డిఫరెన్‌సెస్ ఉన్నాయి. Gen Z సాధారణంగా ఆలోచనలతోపాటు నిద్రకు ప్రాధాన్యత ఇస్తోంది. కాగా వీరిలో 68 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతున్నారు. మరో 53 శాతం మంది పడుకునే ముందు పళ్లు తోముకోవాలని అనుకుంటున్నారు కానీ, మర్చిపోయి పడుకుంటున్నారు. 47 శాతం మంది పగటిపూట ధరించిన దుస్తులు మార్చుకోకుండానే నిద్రపోతున్నారు.

Next Story