- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగిల్స్‌కంటే మింగిల్సే ఎక్కువ..! చీటింగ్‌లకు వేదికవుతున్న డేటింగ్ యాప్స్!

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు డేటింగ్ యాప్స్ అంటే నిజమైన సంబంధాలు కుదుర్చుకునే వేదికలుగా, ముఖ్యంగా సింగిల్స్ తమకు సరైన భాగస్వామిని వెతుక్కునే వేదికలుగా ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డేటింగ్ యాప్స్ అంటేనే ఫేక్ ఫ్రొఫైల్స్‌కు, మోసాలకు అడ్డాగా మారిపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇందులో సింగిల్స్ కంటే మింగిల్స్ ఎక్కువగా నమోదు చేసుకుంటూ, తాము ఇంకా సింగిలేనని చెప్పుకుంటూ చీటింగ్ చేస్తున్న సందర్భాలు అధికంగా ఉంటున్నాయని సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక ట్రెండ్‌గా మారుతోందని అంటున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) కూడా ఇదే తెలిపింది.
65 % పెళ్లైనవారే..
మంచి సంబంధాన్ని వెతుక్కుందామని ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌లోకి ఎంటరైన వారిలో చాలామంది నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే ఇందులో చాలామంది యూజర్లు నిజానికి సింగిల్స్ కారు! ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. డేటింగ్ యాప్స్ వాడుతున్న వారిలో 65 శాతం మంది ఇప్పటికే పెళ్లయినవారు లేదా రిలేషన్‌షిప్‌లో ఉన్నవారేనని తేలింది. అంటే మూడింట రెండు వంతుల మంది యూజర్లు తమకు లైఫ్‌పార్ట్‌నర్ ఉన్నప్పటికీ టిండర్, బంబుల్, హింజ్ వంటి యాప్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందంగా, కాస్త అట్రాక్టివ్‌గా కనిపించిన ప్రతీ ప్రొఫైల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. బాగా పరిచయాలు పెరిగాక తాము మ్యారీడ్ అని చెప్పేస్తున్నారు. దీంతో నిజమైన సంబంధాలకోసం నమోదు చేసుకున్న వారు అసలు విషయం తెలిసి ఇబ్బందికి గురవుతున్నారు. మరికొందరు మోసపోతున్నారు. ఇంకొందరు ఇల్లీగల్ సంబంధాల కోసం ఆన్‌లైన్ డేటింగ్ వేదికలను ఎంచుకుంటున్నారు. దీంతో ఈ యాప్స్‌లో నమోదై జీవిత భాగస్వామిని వెతుక్కుందామనుకునే అసలు ఉద్దేశాలు దూరమవుతున్నాయి. క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది.
క్యూరియాసిటీ కోసమే..
ఎందుకలా జరుగుతోంది? డేటింగ్ యాప్‌లలో సత్సంబంధాలు కాకుండా మోసపూరిత వ్యవహారాలకు గల కారణాలేమిటి? అంటే పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి క్యూరియాసిటీ. అంటే ఎవరైనా తమను లైక్ చేస్తారో లేదో చూద్దామని, వీలైతే రహస్యంగా సంబంధం పెట్టుకుందామని కూడా ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు భావిస్తున్నారు. ఇక మరొక కారణం సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ (నేను ఇంకా అట్రాక్టివ్‌గానే ఉన్నానేమో అని తెలుసుకునే ఉత్సకత), వీటితోపాటు వాలిడేషన్ కోసం, అంటే తాము మింగిల్ అయినప్పటికీ మ్యాచ్‌లు, మెసేజ్‌లు రావడాన్ని చూసి పొందే ఆనందం కోసం డేటింగ్ యాప్‌లలో నమోదు చేసుకుంటున్నారు.
మోసపోతున్న సింగిల్స్ !
మరికొందరు ఇంట్లో ఉండే భాగస్వామికి తెలియకుండా ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం అలా చేస్తున్నారు. కాగా చాలా మంది ఈ యాప్స్‌ను కేవలం “విండో షాపింగ్”లా వాడుతున్నారు. అంటే చూడటం, స్వైప్ చేయడం, మెసేజ్‌లు చేయడం వీరికో సరదా తప్, రియల్ లైఫ్‌లో కలవాలనే ఆలోచన ఉండదు. దీంతో నిజంగా ప్రేమ కోసం లేదా సీరియస్ రిలేషన్ కోసం వచ్చిన సింగిల్ వ్యక్తులు మోసపూరిత అనుభవాలు ఎదుర్కొంటున్నారు. నిరాశ, గందరగోళం మిగులుతున్నాయి. దీంతో చాలామందికి నమ్మకం తగ్గుతోంది. అందుకే ఇటీవల డేటింగ్ యాప్‌ల వాడకాన్ని పలువురు తగ్గిస్తున్నారు. ఇక వాడుతున్నవారు కూడా కేవలం క్యూరియాసిటీ లేదా వేరే ఉద్దేశంతో ఉంటున్నారని సర్వే పేర్కొన్నది. Link






