పెళ్లి కాని ప్రసాద్‌లు.. 30ఏళ్ల వయసొచ్చినా మీకు పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా?

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-09 15:21:34  IST  )

30ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండా ఉన్న పురుషులు 63శాతం మంది ఉన్నారని తేల్చింది తాజా అధ్యయనం. ఇందులో కొందరు ప్రేమలో కూడా లేరని తెలిపింది. కానీ అమ్మాయిల విషయానికి వస్తే ఈ సంఖ్య

పెళ్లి కాని ప్రసాద్‌లు.. 30ఏళ్ల వయసొచ్చినా మీకు పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : 30ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండా ఉన్న పురుషులు 63శాతం మంది ఉన్నారని తేల్చింది తాజా అధ్యయనం. ఇందులో కొందరు ప్రేమలో కూడా లేరని తెలిపింది. కానీ అమ్మాయిల విషయానికి వస్తే ఈ సంఖ్య 34శాతం మాత్రమే ఉంది. అంటే అబ్బాయిలు అమ్మాయిల కంటే దాదాపు రెండు రెట్లు సింగిల్‌గా ఉండే అవకాశం ఉండగా.. ఇందుకు గల కారణాలు తెలుసుకుందాం.

* చాలా మంది యువతులు (18-29) తమ కంటే పెద్ద వయస్సు గల పురుషులను (30 ఏళ్ల పైబడిన వారిని) డేట్ చేయడానికి ఇష్టపడతారు. దీని వల్ల యువకులకు అందుబాటులో ఉన్న యువతుల సంఖ్య తగ్గుతుంది.

* అమ్మాయిలు తాము క్యాజువల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా దాన్ని కమిటెడ్‌గా భావించవచ్చు. కానీ పురుషులు అలా అనుకోరు. ఇది సర్వే ఫలితాలను ప్రభావితం చేస్తుంది.

* ఆర్థిక స్థిరత్వం, ఉన్నత విద్య లేకపోవడం వంటివి యువకులను డేటింగ్ మార్కెట్‌లో తక్కువ చేస్తున్నాయి. అమ్మాయిలు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ ప్రమాణాలను ఆశిస్తున్నారు.

* కొవిడ్ లాక్‌డౌన్‌ల వల్ల సామాజిక ఒంటరితనం పెరిగింది. సోషల్ మీడియా, ఇతర డిజిటల్ మాధ్యమాలపై ఆధారపడటం వల్ల వాస్తవ సంబంధాలు తగ్గాయి.

* 2021 గాలప్ సర్వే ప్రకారం 15% మంది పురుషులకు సన్నిహిత స్నేహితులు లేరు. ఇది అమ్మాయిల కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఈ ఒంటరితనం రొమాంటిక్ సంబంధాలను కష్టతరం చేస్తుంది.

* ఆర్థిక ఒత్తిళ్ల వల్ల చాలా మంది యువకులు తల్లిదండ్రులతో ఎక్కువ కాలం ఉంటున్నారు. ఇది డేటింగ్‌ను ప్రభావితం చేస్తుంది.

* సింగిల్ పురుషులలో ఒంటరితనం, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.

* వివాహ వయస్సు పెరగడం, పురుషులు తక్కువ విద్యావకాశాలు పొందడం వంటివి ఈ ధోరణిని కొనసాగించవచ్చు.

Next Story