- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మో బామ్మా.. రెండు రోజుల్లో బుల్లెట్ డ్రైవింగ్.!
రెండంటే రెండ్రోజుల్లో బుల్లెట్టు బండి నడపడం నేర్చుకొని రికార్డు క్రియేట్ చేసిన ట్రెండ్ సెట్టర్

దిశ, ఫీచర్స్: మామూలుగా 60 ఏళ్ల వయసొచ్చే సరికి ఎలా మారుతున్నారు జనాలు.? చాలామంది రిటైర్మెంట్ తీసుకొని ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ కొందరు మాత్రం యవ్వనంలో ఉన్నట్లు చురుగ్గా అంటారు. అలాంటి బామ్మనే లతా శ్రీనివాసన్.
రెండ్రోజుల్లోనే..
కోయంబత్తూరులోని కెఫె క్రూయిజర్స్ మోటార్ సైకిల్ అకాడమీలో యువత బైక్ రైడింగ్ నేర్చుకుంటోంది. అదే అకాడమీలో బుల్లెట్ మీద రాణిలా కూర్చొని.. తలకు హెల్మెట్ పెట్టుకొని.. రెండు చేతులను హ్యాండిల్ మీద పెట్టి.. అచ్చం సినిమాల్లో మాదిరి పోజిస్తోంది ఒకావిడ. వయసు చూస్తెనేమో పెద్దావిడలా ఉంది. ఆమె యాక్టివ్ నెస్ చూస్తెనేమో యువతతో రేసులో పోటీ పడలా ఉంది అని అందరూ ఆమెనే చూస్తుండిపోయారు. ఆ 60 ఏళ్ల బామ్మనే లతా శ్రీనివాసన్. ఇప్పుడామె ఒక సెన్సేషన్. రెండంటే రెండ్రోజుల్లో బుల్లెట్టు బండి నడపడం నేర్చుకొని రికార్డు క్రియేట్ చేసిన ట్రెండ్ సెట్టర్.
అకాడమీలో ట్రైనింగ్..
వడవల్లికి చెందిన లత గతంలో కార్పొరేట్ మేనేజర్‌గా పనిచేసింది. ఎప్పట్నుంచో బైక్ నడపాలి.. రోడ్డుమీద రయ్‌మని దూసుకెళ్లాలనేది తన కల. ఆమె ఎన్నో ఏండ్లుగా సైకిల్ సవారీ చేస్తోంది. ఒక్కరోజులో 50 కిలోమీటర్లు సైకిల్ సవారీ చేసిన అనుభవం తనకుంది. కానీ బైక్ జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. వయసు 60 దాటింది. ఎందుకులే అనుకుంది. కానీ.. ఏదో వెలితిగా అనిపించి కచ్చితంగా బైక్ నేర్చుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రిటైర్మెంట్ జీవితాన్ని సైకిల్ సవారీతో కాకుండా.. బైక్ సవారీతో ఎంజాయ్ చేయాలనుకుంది లత. అందుకే మోటార్ సైకిల్ అకాడమీలో చేరింది.
బుల్లెట్ రైడర్..
లత.. అకాడమీలో సాధారణ బైక్ కాకుండా ఏకంగా బుల్లెట్టే పట్టుకుంది. మొదట బుల్లెట్టు బండిని చూసి ఆ బరువును మెయింటెన్ చేయగలుగుతామా.. స్పీడ్ కంట్రోలింగ్ మనవల్ల అవుతుందా అనే సందేహం కలిగింది. కానీ కెఫె క్రూయిజర్స్ అకాడమీ ట్రైనర్లు ఆమెకు గైడ్ చేశారు. ఇక ధైర్యంతో బుల్లెట్టెక్కింది లత. మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టింది. రకరకాల మోడల్ బైక్‌లను ట్రై చేసి మొత్తానికి తిరుగులేని రైడర్‌గా మారిపోయింది. తన దూకుడు చూసి.. ఇంత త్వరగా నేర్చిందేంటీ అని ట్రైనర్లే ఆశ్చర్యపోయారు.






