ప్రేమకోసం కాదు.. 60% మంది డేటింగ్ యాప్‌లను అందుకోసమే వాడుతున్నారు..!

by Javid Pasha |   (  Updated:2025-10-28 06:18:36  IST  )

డేటింగ్ యాప్స్ ఉపయోగించే వారిలో 60% మంది నిజమైన ప్రేమ కోసం వాటిని ఉపయోగించడం లేదు.

ప్రేమకోసం కాదు.. 60% మంది డేటింగ్ యాప్‌లను అందుకోసమే వాడుతున్నారు..!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి ప్రత్యక్ష పరిచయాలు, బంధుత్వాలు, అప్పటికే తెలిసిన సంబంధాలపై ఆధారపడేవారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. భారత దేశంలో ఈ కల్చర్ కొంచెం తక్కువ కానీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రేమ లేదా రిలేషన్‌షిప్ కోసం ఎక్కువగా డేటింగ్ యాప్‌లు లేదా సైట్లపై ఆధారపడుతుంటారు. అయితే ఇటీవల ఈ పరిస్థితిలోనూ మార్పు కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. నిజమైన ప్రేమ లేదా సంబంధాల కోసం మాత్రమే వినియోగదారులు వాటిని యూజ్ చేయట్లేదని చెబుతున్నారు.

యుగోవ్ (YouGov) 1,000 మంది అడల్ట్స్‌పై నిర్వహించిన సర్వే ప్రకారం.. డేటింగ్ యాప్స్ ఉపయోగించే వారిలో 60% మంది నిజమైన ప్రేమ కోసం కాకుండా, కేవలం అవసరం, ఫ్రెండ్‌షిప్, శ్రద్ధ(Attention) కోసమే వాటిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా 18-29 ఏండ్ల వయసు గలవారిలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక క్యాజువల్ డేటింగ్ కోసం కేవలం 19% మంది, స్నేహం కోసం 21% మంది ఈ యాప్స్‌ని ఉపయోగిస్తున్నారు.

ఆన్‌లైన్ డేటింగ్‌లో లైక్స్, మెసేజ్‌లు, కామెంట్స్ ద్వారా తాత్కాలిక ఆనందం పొందడం సులభమైనప్పటికీ, నిజమైన రిలేషన్‌షిప్‌ను, ప్రేమను కనుక్కోవడం కష్టంగా ఉందని చాలా మంది ఫీలవుతున్నారు. ముఖ్యంగా డేటింగ్ యాప్స్‌లో ఈ అటెన్షన్-సీకింగ్ బిహేవియర్ ఎక్కువైందని సర్వే చెబుతోంది. ఇది ఆధునిక డేటింగ్ కల్చర్‌లో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుందని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు అంటున్నారు. యాప్స్‌లో స్వైప్ చేస్తూ, మ్యాచ్‌లు వస్తే సంతోషిస్తున్నవారు చాలామందే ఉంటున్నారు.. కానీ లోతైన కనెక్షన్స్ కోసం తక్కువ మందే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఈ ట్రెండ్ యువతలో ఒంటరితనం, సోషల్ వ్యాలిడేషన్ కోసం ఆధారపడటం వంటి పరిస్థితులను పెంచుతోందని కూడా సర్వే పేర్కొన్నది.

Next Story