టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతున్నాయా? ఈ 5 తప్పులు చేయకండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-15 11:03:56  IST  )

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన జీవితానికి భద్రత కలిగించే ఒక ఆర్థిక రక్షణ వ్యవస్థ. మనం ఊహించని సమయంలో మన కుటుంబానికి అండగా నిలవడానికే ఈ పాలసీ తీసుకుంటాం.

టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతున్నాయా? ఈ 5 తప్పులు చేయకండి
X

దిశ, వెబ్‌డెస్క్: టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన జీవితానికి భద్రత కలిగించే ఒక ఆర్థిక రక్షణ వ్యవస్థ. మనం ఊహించని సమయంలో మన కుటుంబానికి అండగా నిలవడానికే ఈ పాలసీ తీసుకుంటాం. అయితే.. చాలా సందర్భాల్లో పాలసీ ఉన్నప్పటికీ క్లెయిమ్ తిరస్కరణలు జరుగుతున్నాయి. కారణం? అప్లికేషన్ సమయంలో లేదా పాలసీ కాలంలో చేసే కొన్ని సాధారణమైన తప్పులు. ఇవి చిన్నచిన్న తప్పుల్లా అనిపించినా ఫ్యామిలీ ఫ్యూచర్ కి పెద్ద ప్రమాదంగా మారతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు కారణమయ్యే 5 ప్రధానమైన కారణాలు తెలుసుకుందాం.

1. వైద్య సమాచారం దాచడం లేదా తప్పుగా ఇవ్వడం

పాలసీ తీసుకుంటున్నప్పుడు చాలా మంది తమ ఆరోగ్య సమస్యల గురించి.. ఉదాహరణకు డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ధూమపానం, మద్యపానం వంటివి దాచేస్తారు. చనిపోయిన తర్వాత ఈ సమస్యల వల్లే మరణించినట్లు నిర్ధారణ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ తిరస్కరించవచ్చు.

2. ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పాలసీ లాప్స్ అవ్వడం

ప్రీమియంను సమయానికి చెల్లించకపోతే పాలసీ ఆటోమాటిక్‌గా రద్దవుతుంది. అలా జరిగితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కంపెనీ క్లెయిమ్‌ను అంగీకరించదు. ఇది ఒక సాంకేతిక కారణమైనా, పూర్తిగా నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది.

3. నామినీ వివరాలు ఇవ్వకపోవడం లేదా నవీకరించకపోవడం

పాలసీ తీసుకునేప్పుడు చాలా మంది నామినీ వివరాలు ఇవ్వకపోవడం లేదా కుటుంబ పరిస్థితుల మార్పుని బట్టి నవీకరించకపోవడం జరుగుతుంది. దీని వల్ల క్లెయిమ్ సమయంలో లీగల్ ఇబ్బందులు ఏర్పడి క్లెయిమ్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది.

4. వ్యక్తిగత సమాచారం తప్పుగా ఇవ్వడం

వయసు, ఆదాయం, వృత్తి, కుటుంబ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం తప్పుగా ఇవ్వడం వల్ల కూడా క్లెయిమ్ తిరస్కరణకు దారి తీస్తుంది. ఇది అనేకమందిలో తెలియకుండానే జరుగుతుంది, కానీ ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.

5. పాలసీదారుడు మృతి చెందిన విషయాన్ని సమయానికి తెలియజేయకపోవడం

పాలసీదారుడి మరణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి నిర్ణీత సమయంలో తెలియజేయాలి. ఆలస్యమైతే క్లెయిమ్ తిరస్కరణకు అవకాశం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు పాటించాలి

పాలసీ అప్లికేషన్ సమయంలో అన్ని వివరాలు నిజంగా, పూర్తిగా ఇవ్వండి

ప్రీమియంలు సమయానికి చెల్లించండి లేదా ఆటో డెబిట్ ఆన్ చేయండి

నామినీ వివరాలను సమయానికి అప్డేట్ చేస్తూ ఉండండి

పాలసీ డాక్యుమెంట్లు, నిబంధనలు పూర్తిగా చదవండి

అవసరమైతే ఓ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌ను సంప్రదించండి

టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కేవలం పాలసీ తీసుకోవడమే కాదు. దానిని జాగ్రత్తగా నిర్వహించడమూ అవసరం. చిన్న తప్పులు family's future ను డేంజర్‌లో పడేస్తాయి. కాబట్టి పాలసీ కొనుగోలు చేసే ప్రతి దశలో జాగ్రత్త అవసరం. అప్పుడే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది. మీరు లేని సందర్భంలో కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే స్థితిలో ఉంటుంది.

Next Story