భాగస్వాముల వద్ద ఆర్థిక విషయాలను దాస్తున్న 49% మంది పురుషులు.. కారణం ఇదే..!

by Javid Pasha |

49% మంది పురుషులు తమ పార్ట్‌నర్స్ వద్ద ఆర్థిక విషయాలను దాచిపెడుతున్నారని ఒక సర్వే పేర్కొన్నది.

భాగస్వాముల వద్ద ఆర్థిక విషయాలను దాస్తున్న 49% మంది పురుషులు.. కారణం ఇదే..!
X

దిశ, ఫీచర్స్ : అన్ని విషయాలూ అందరితో షేర్ చేసుకోలేరు కొందరు. ముఖ్యంగా ఆర్థిక అంశాలను అత్యంత నమ్మకమైన వ్యక్తితోనో, భాగస్వామితోనో పంచుకుంటారని చెబుతుంటారు. కానీ ఇంట్రస్టింగ్ ఇంజినీరింగ్ (Interesting engineering) అనే ఒక ఆన్‌లైన్ వేదిక 2000 మందిపై నిర్వహించిన సర్వే మాత్రం అందుకు భిన్నమైన అంశాన్ని వెల్లడించింది. 49% మంది పురుషులు తమ పార్ట్‌నర్స్ వద్ద ఆర్థిక విషయాలను దాచిపెడుతున్నారని పేర్కొన్నది. ఇలాంటి రహస్యాల్లో సేవింగ్స్ ఖాతాలు, బహిర్గతం చేయని కొనుగోళ్లు, లేదా అప్పులు వంటివి కూడా ఉంటున్నాయి.

భాగస్వామి వద్ద ఆర్థిక విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచుతారని సర్వేలో భాగంగా ప్రశ్నించినప్పుడు 27% మంది సిగ్గు పడ్డారని, 26% ఇలాంటివి భార్యలకు చెప్పడం అవమానంగా భావించారని, 19% మంది డబ్బు గురించి ఎలా మాట్లాడాలో తెలియక అన్నీ చెప్పడం లేదని వెల్లడించినట్లు సర్వేను పేర్కొన్నది. దీంతోపాటు అధిక భావోద్వేగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా కొందరు పురుషులు భాగస్వాములవద్ద డబ్బు వ్యవహారాలను చర్చించడం కంటే.. మౌనంగా ఉండటమే ఉత్తమమని భావిస్తున్నట్లు సర్వే తెలిపింది. Link

Next Story