- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ న్యూస్.. నాలుగు లక్షల మంది ఆత్మహత్య..
బలవన్మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 2025 మొదటి ఆరు నెలల్లో దాదాపు 4, 44, 536 ఆత్మహత్యలు సంభవించినట్లు ఓ అధ్యయనం తెలిపింది. వీరిలో 75–80% మంది పురుషులు ఉన్నట్లు చెప్పింది. మగాళ్లు ఎదుర్కొనే మానసిక

దిశ, వెబ్‌డెస్క్ : బలవన్మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 2025 మొదటి ఆరు నెలల్లో దాదాపు 4, 44, 536 ఆత్మహత్యలు సంభవించినట్లు ఓ అధ్యయనం తెలిపింది. వీరిలో 75–80% మంది పురుషులు ఉన్నట్లు చెప్పింది. మగాళ్లు ఎదుర్కొనే మానసిక సంఘర్షణకు ఇది ఉదాహరణ. కాగా పురుషులు స్ట్రాంగ్‌గా ఉండాలి.. ఏడవకూడదు.. ఎంత ఒత్తిడి ఉన్నా బయటకు చెప్పకూడదనే.. సొసైటీ నిబంధనలు లోలోపలే కుమిలిపోయేలా చేస్తున్నాయి. నిశ్శబ్ద పోరాటాల నుంచే ఇలాంటి సూసైడల్ థాట్స్ వస్తుండగా.. ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం.
1. మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు చాలా మంది పురుషులలో నిర్లక్ష్యం చేయబడతాయి. గుర్తించబడవు.
2. సామాజిక ఒత్తిడి: ‘మగాడు ఏడవకూడదు’ అనే సాంప్రదాయ ఆలోచనలు పురుషులను తమ బాధలను దాచుకునేలా చేస్తాయి.
3. ఆర్థిక భారం: ఉద్యోగ నష్టం, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతల ఒత్తిడి పురుషులపై ఎక్కువగా పడతాయి.
4. సామాజిక ఒంటరితనం: స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో భావోద్వేగాలను పంచుకోకపోవడం వల్ల ఒంటరితనం పెరుగుతుంది.
5. మానసిక సహాయం లేకపోవడం: మానసిక ఆరోగ్య సేవలు అందుబాటు లేకపోవడం, సహాయం అడగడానికి సిగ్గుపడటం.
నిపుణులు చెప్తున్నదేంటి??
అందుకే మగాడిలా ఉండు అనే మాటలను ఆపి.. ఏదైనా బాధ ఉంటే పంచుకోమని, సహాయం అడగడంలో తప్పు లేదని చెప్తూ పిల్లలను పెంచండి. దీనిపై సమాజంలో అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవడం, బహిరంగ సంభాషణలను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణం సృష్టించడం అవసరం అంటున్నారు నిపుణులు.






