బ్రేకప్ చెప్పిన ప్రేయసి కోసం తీవ్ర వర్షంలో 21 గంటలు.. మోకాళ్లపై కూర్చొని వెయిటింగ్..!

by Disha Web Desk 9 |
బ్రేకప్ చెప్పిన ప్రేయసి కోసం తీవ్ర వర్షంలో  21 గంటలు.. మోకాళ్లపై కూర్చొని వెయిటింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమలో ఉన్నంత వరకు ఎంత సంతోషంగా ఉంటారో.. అలాగే విడిపోయాక అంతకన్నా ఎక్కువగా బాధ కలుగుతుంది. ఇద్దరి ఇష్టానుసారంగా బ్రేకప్ చేసుకొంటే పెద్దగా బాధ ఉండకపోవచ్చు. కానీ ఒకరికి రిలేషన్‌షిప్ కొనసాగించాలని.. ఎదుటి వ్యక్తికి వద్దని ఉంటే మాత్రం అది అనేక సమస్యలకు దారి తీయొచ్చు. కొంతమంది తమలో తామే బాధను దిగమింగుతారు. కానీ కొందరూ.. వారి ప్రాణానికి వారే హాని తలపెట్టుకుంటారు. ఇలాంటి సంఘటనే చైనాలో దాజౌ ఏరియాలో ఓ యువకుడి విషయంలో చోటు చేసుకుంది. ఇద్దరి ప్రేమికుల మధ్య గొడవ జరగడంతో ప్రేయసి ఓ యువకుడికి బ్రేకప్ చెప్పింది.

దీంతో అతడు తన గర్ల్‌ఫ్రెండ్ క్షమిస్తుందనీ తీవ్రమైన చలిలో బొకే పట్టుకొని ఆమె ఆఫీసు ముందు 21గంటల పాటు మోకాళ్లపై కూర్చుని ఎదురుచూశాడు. మార్చి 28వ తేదీన మధ్యాహ్నం 1 గంటల సమయానికి మోకరిల్లిన ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు అలాగే ఉన్నాడు. అయినప్పటికీ తన గర్ల్‌ఫ్రెండ్ అతడిపై కాస్తంత కనికరం కూడా చూపించలేదు. యువకుడిని ఆ పరిస్థితిలో చూసిన చుట్టు పక్కల వారు... ‘ఇంటికి వెళ్ళు బాబు, ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది, ఆమె రావడం లేదు కదా’,అంటూ నచ్చచెప్పినా అతడు వినిపించుకోలేదు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఆ యువకుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఆ యువకుడు స్పందించి... ‘‘ఇలా కూర్చొవడం చట్టానికి వ్యతిరేకమా? అయితే చెప్పండి ? లేకపోతే ఒంటరిగా వదిలేయండంటూ పోలీసులను వేడుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

వన్‌సైడ్ లవర్స్‌గా మిగిలిపోయేది ఈ రాశుల వారే..!

బలగంతో శృంగానికి ఎఫెక్ట్.. మైండ్‌బ్లోయింగ్ సెక్స్ కావాలంటే..!



Next Story

Most Viewed