- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిరుచినే అవకాశంగా మలచుకొని.. ఓ 19 ఏళ్ల యువకుడి సక్సెస్ జర్నీ!
సాధారణంగా చాలామంది టీనేజర్లు కాలేజీ అప్లికేషన్, కెరీర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ అతను చదువుతోపాటు డిజిటల్ ఫ్యాషన్‌పై ఆసక్తి పెంచుకున్నాడు.

దిశ, ఫీచర్స్ : జీవితంలో సక్సెస్ వైపు నడిపించే అవకాశాలు రావట్లేదని నిరాశ చెందుతుంటారు కొందరు. రావడం సంగతి పక్కన పెట్టి, తామే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని విజయ తీరాల వైపు అడుగులు వేస్తుంటారు మరికొందరు. ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తే 19 ఏళ్ల అర్జున్ గోయల్. చేతిలో ఎటువంటి పెట్టుబడి లేకుండానే ఒక సాధారణ యువకుడిగా ప్రయత్నం ప్రారంభించిన అర్జున్ నేడు ‘మెటా ఫ్యాషన్’ కో- ఫౌండర్ & సీఈఓగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? మెటా ఫ్యాషన్ లక్ష్యమేంటి?
అభిరుచిగా ప్రారంభమై..
సాధారణంగా చాలామంది టీనేజర్లు కాలేజీ అప్లికేషన్, కెరీర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ అర్జున్ గోయల్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. చదువుకుంటూనే ఒక అభిరుచిని అనుసరించడం మొదలు పెట్టాడు. అతను న్యూఢిల్లీలో హైస్కూల్ చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత తన 15 ఏళ్ల వయసులోనే Robloxలో డిజైన్ చేయడం ప్రారంభించాడు. ఈ అలవాటే అతన్ని డిజిటల్ ఫ్యాషన్ రంగంపై మరింత ఆసక్తి పెంచింది. ఈ క్రమంలో 18 ఏళ్ల వయసులో Shark Tank India Season 5లో పిచ్ చేశాడు. 19 ఏళ్ల వయసుతో తనే స్వయంగా మెటా ఫ్యాషన్‌ను స్థాపించి సుమారు ₹3.3 కోట్లు ($400K) ఫండింగ్ కూడా సమకూర్చుకున్నాడు. 2022లో స్థాపించిన ఈ స్టార్టప్ ఇప్పుడు ఏఐ పవర్డ్ స్టైలింగ్& అసెట్క్రియేషన్ టూల్స్‌తో డిజిటల్ ఫ్యాషన్ అభివృద్ధి చేస్తోంది.
వర్చువల్ దుస్తులు, యాక్సెసరీలు
మెటా ఫ్యాషన్‌లో డిజిటల్ ఫ్యాషన్ డిజైన్ చేస్తారు. అంటే, రియల్ దుస్తులు కాకుండా వర్చువల్ (డిజిటల్) దుస్తులు, యాక్సెసరీలు (హెయిర్ స్టైల్స్, జ్యువెలరీ, షూస్, టాప్స్, హుడీలు మొ.) రూపొందిస్తారు. ఇవి Roblox, Fortnite, GTA, ZEPETO వంటి గేమ్స్ & మెటావర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవతార్లు (avatars) ధరించేందుకు ఉపయోగపడతాయి. 3D మోడలింగ్, ఏఐ టూల్స్ ఉపయోగించి ట్రెండీ డిజైన్లు తయారు చేసి, గేమ్‌లో అమ్ముతారు. ఇది సాధారణ దుస్తుల డిజైనింగ్‌కి భిన్నం. ఇక్కడ ఫాబ్రిక్, స్టిచింగ్ లేవు, కానీ డిజిటల్‌గా ఎలా కనిపించాలి, అవతార్‌కి ఎలా ఫిట్ అవ్వాలి అనేది ముఖ్యం. AI సహాయంతో ట్రెండ్స్ గుర్తించి త్వరగా డిజైన్లు తయారు చేస్తారు.
చదువుతోపాటు సంపాదన
అర్జున్ గోయల్ నేతృత్వంలోని మెటా ఫ్యాషన్ ఇప్పుడు రోబ్లాక్స్, ఫోర్ట్‌నైట్, గ్రాండ్ థెఫ్ట్ ఆటో (GTA), ZEPETO వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం ఫ్యాషన్ ఐటెమ్స్ డిజైన్ చేస్తోంది. ఒక వైపు అర్జున్ తనపై చదువులు కొనసాగిస్తూనే దీనిని రన్ చేస్తున్నాడు. తన అభిరుచిని బిజినెస్(Roblox డిజైన్)గా మార్చాడు. ఇది చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అని చెప్పవచ్చు. మెటా ఫ్యాషన్ ఇప్పుడు ల్యూమికై (Lumikai) నేతృత్వంలోని ప్రీ-సీడ్ రౌండ్‌లో సుమారు ₹3.3 కోట్లు నిధులు సమకూర్చుకోవడంతోపాటు బిగ్‌బెస్ట్, అక్షిత్ రాథి, ప్రథమ్ మిట్టల్ వంటి ఇన్వెస్టర్లు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. వారి గేమ్ GlamGirlsలో 1 లక్షకు పైగా పేయింగ్ యూజర్లు ఉన్నారు. ఇందులో 75% మహిళా యూజర్లు, 50% మంది 18 ఏళ్లు పైన ఉన్నారు.
₹2.5 కోట్ల గ్రాస్ మార్జిన్..
మెటా ఫ్యాషన్ ఇప్పుడు డిజిటల్ ఔట్‌ఫిట్స్‌ను రియల్ వరల్డ్ అప్పరల్(Real world apparel)గా మార్చే అనుసరిస్తోంది. వాల్‌మార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని రియల్ ప్రొడక్ట్స్‌ను వర్చువల్ స్పేస్‌లోకి తీసుకువస్తోంది. ఇది డిజిటల్ ఫ్యాషన్‌ను రియల్ లైఫ్‌తో అనుసంధానం చేస్తూ, యువతకు కొత్త అనుభవాన్ని అందిస్తోంది. అవకాశాలను సృష్టిస్తోంది. మొత్తానికి మెటా ఫ్యాషన్ సాంప్రదాయ ఫ్యాషన్‌ను డిజిటల్ ప్రపంచంతో మేళవించి, యువత ఫ్యాషన్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తూ సక్సెస్ అవుతోంది. మెటా ఫ్యాషన్ ఇప్పటి వరకు రోబ్లాక్స్‌లో 2.5 మిలియన్ వర్చువల్ ఫ్యాషన్ ఐటెమ్స్ అమ్మి సుమారు ₹2.5 కోట్ల వాణిజ్య విలువ సాధించింది. 92% గ్రాస్ మార్జిన్‌తో పని చేస్తోంది. దీనికి కారణం అర్జున్ గోయల్. కాగా అతన్ని ప్రోత్సహిస్తూ సహకరించడంలో అతని తండ్రి సంజయ్ గోయల్ కీలకపాత్ర పోషించారు. ఒక సాధారణ యువకుడు పెద్ద పెద్ద డిగ్రీలు లేకుండానే అభిరుచినే అవకాశంగా మల్చుకొని ఎదిగిన తీరు నేటి యువతకు ఒక ప్రేరణగా చెప్పవచ్చు.






