- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దెయ్యాలు ఉన్నాయా? అక్కడి ఆడవాళ్లు చెప్తుంది నిజమేనా?? సంచలన విషయాలు బయటపెట్టిన రీసెర్చ్
దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని చూశామని లేదా ఆ చోట భూతం ఉందని ఫీల్ అవుతారు. ఈ అంశంపైనే ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించగా.. సంచలన ఫలితాలు వెలువడ్డాయి.

దిశ, ఫీచర్స్ : దేవుడు ఉన్నాడని నమ్మేవారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని చూశామని లేదా ఆ చోట భూతం ఉందని ఫీల్ అవుతారు. ఈ అంశంపైనే ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించగా.. సంచలన ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 18శాతం మంది అమెరికన్లు దెయ్యాన్ని చూశామని, దాని సమక్షంలో ఉన్నామని తెలిపారు. 29% మంది చనిపోయిన వ్యక్తితో సంబంధంలో ఉన్నట్లు భావించగా.. ఇలాంటి అనుభవాలను స్త్రీలు ఎక్కువగా నివేదించడం విశేషం. ఇంక వింతేంటంటే.. గుడికి తక్కువగా వెళ్లేవారు దెయ్యాలను చూసినట్లు చెప్పినవారిలో ఎక్కువ మంది ఉన్నారు.
2021లో యూగోవ్ సర్వే ప్రకారం.. 20% అమెరికన్లు దెయ్యాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. 41% మంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నట్లు తెలిపారు. మహిళలు 25%, 30 ఏళ్లలోపు యువకులు 27% ఈ అనుభవాలను ఎక్కువగా నివేదించారు. కాగా ఈ ఎక్స్‌పీరియన్స్ తరచుగా మానసిక, పర్యావరణ కారకాలను సూచిస్తాయి. ఉదాహరణకు స్లీప్ పారాలిసిస్.. ఇది భ్రాంతులు లేదా ఫీలింగ్ ఆఫ్ ప్రెజెన్స్‌ను కలిగిస్తుంది. లేదా ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్.. అంటే వివరించలేని సంఘటనలను అతీంద్రియ కారణాలకు ఆపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్.. ఒక ల్యాబ్ ప్రయోగంలో రోబోటిక్ కదలికల ఆలస్యం ద్వారా దెయ్యం లాంటి సంచలనాలను పున: సృష్టించారు. ఇది అదృశ్య శక్తి ఏదో ఉందని భావించేలా చేసింది. ఇలాంటి శాస్త్రీయ వివరణలు ఉన్నప్పటికీ, దెయ్యాలపై నమ్మకం గణనీయంగా ఉంది. కొందరు వాటిని ప్రియమైన వారి జ్ఞాపకాలుగా భావిస్తే.. ఇంకొందరు మానసిక అనారోగ్యంగా పరిగణిస్తారు. అయితే దెయ్యాల ఉనికికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.






