- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు తేలుతూ..
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలో పెద్దపులితో పాటు హీరో సముద్రంలో తప్పిపోయి, ఎలాగోలా బతుకుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. సరిగ్గా అలాగే.. లేదు లేదు.. అంతకంటే వైవిధ్యంగా, 46 ఏళ్లు ఉన్న ఒక మహిళ రెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఇటీవల లైఫ్ జాకెట్ ధరించి సముద్రంలో ప్రాణాల కోసం అల్లాడుతూ కనిపించింది. హైపోథెర్మియాతో ఇబ్బందిపడుతూ అంజెలికా గైటాన్ కొలంబియా తీరంలో మత్స్యకారుడు రొనాల్డో విస్బల్‌కు కనిపించింది. శనివారం రోజున ఉదయం ఆరు గంటలకు ప్యూర్టో కొలంబియాకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలో పెద్దపులితో పాటు హీరో సముద్రంలో తప్పిపోయి, ఎలాగోలా బతుకుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. సరిగ్గా అలాగే.. లేదు లేదు.. అంతకంటే వైవిధ్యంగా, 46 ఏళ్లు ఉన్న ఒక మహిళ రెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఇటీవల లైఫ్ జాకెట్ ధరించి సముద్రంలో ప్రాణాల కోసం అల్లాడుతూ కనిపించింది. హైపోథెర్మియాతో ఇబ్బందిపడుతూ అంజెలికా గైటాన్ కొలంబియా తీరంలో మత్స్యకారుడు రొనాల్డో విస్బల్‌కు కనిపించింది. శనివారం రోజున ఉదయం ఆరు గంటలకు ప్యూర్టో కొలంబియాకు 1.2 మైళ్ల దూరంలో ఏదో కనిపించినట్లుగా రొనాల్డోకి అనిపించింది. ముందు అది ఒక పెద్ద కర్రమొద్దు అనుకున్నాడు కానీ తర్వాత గాల్లో చేయి ఊపడం చూసి ఆ దిశగా వెళ్లాడు.
అప్పటికే సముద్రంలో నానిపోయి, హైపోథెర్మియాతో బాధపడుతూ, మాట్లాడటానికి కూడా కష్టంగా ఉన్న అంజెలికా గైటాన్‌ను రొనాల్డో కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్తాడు. ఈ వార్తను మీడియా ద్వారా తెలుసుకున్న గైటాన్ కూతురు అలెగ్జాండ్రా క్యాస్టిబ్లాంకో ఆమెను గుర్తుపట్టారు. రెండేళ్ల క్రితం బొగోటాలో తన తల్లి తప్పిపోయిందని, మళ్లీ ఇప్పుడిలా సముద్రంలో దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అలెగ్జాండ్రా అంది. అయితే ఈ రెండేళ్ల పాటు ఆమె సముద్రం మీదనే ఉన్నారా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఇప్పుడు వదిలేశారా? అనే విషయాలు ఆమె ఆరోగ్యపరంగా తేరుకున్నాక గానీ తెలియవు. అంతేకాకుండా రెండేళ్ల క్రితం గైటాన్ ఇంట్లో గొడవపడి వెళ్లిపోయిందన్న మాటలను అలెగ్జాండ్రా ఖండించింది.






