- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
by Batti.Sumithra |
<p>దిశ,సికింద్రాబాద్: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ 10వేల జరిమానా విధిస్తూ న్యాయ మూర్తి తీర్పు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ కు చెందిన యువతిని వారాసిగూడ కు చెందిన ఆరెపల్లి వెంకట్ ఆర్ట్స్ కాలేజీ వెనకాల ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును […]</p>

X
దిశ,సికింద్రాబాద్: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ 10వేల జరిమానా విధిస్తూ న్యాయ మూర్తి తీర్పు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధనగర్ కు చెందిన యువతిని వారాసిగూడ కు చెందిన ఆరెపల్లి వెంకట్ ఆర్ట్స్ కాలేజీ వెనకాల ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఓయూ పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును బుధవారం రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సీహెచ్ వీవీఆర్ ప్రసాద్ విచారణ జరిపారు. ముద్దాయి ఆరెపల్లి వెంకట్‌కు జీవిత ఖైదు తో పాటు రూ. 10,000 జరిమానా విధించారు.
Next Story






