డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎంతో ఎల్ఐసీ ఒప్పందం!

by  |
డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎంతో ఎల్ఐసీ ఒప్పందం!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ తన డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు దేశీయ పేమెంట్ సంస్థ పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇదివరకు మరొక పేమెంట్ గేట్‌వేతో కుదుర్చుకున్న తర్వాత ఎల్ఐసీ తన లావాదేవీల్లో ఎక్క్కువ భాగం డిజిటల్ విభాగంలోకి మారుతున్న నేపథ్యంలో కొత్త ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా సులభమైన చెల్లింపుల విధానం, విస్తృతమైన పేమెంట్ ఆప్షన్లు, పేమెంట్ ఛానెళ్ల అవసరం తీర్చడమని ఎల్ఐసీ పేర్కొంది. ఎల్ఐసీతో ఒప్పందం కోసం ముందస్తు బిడ్ వేసిన జాబితాలో మొత్తం 17 పేమెంట్ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, యూపీఐ, కార్డుల వంటి విభాగాల్లో పేటీఎంకు ఉన్న అనూకూల అంశాలు ఈ ఒప్పందాన్ని దక్కించుకునేందుకు దోహదపడ్డాయని సమాచారం. కరోనా మహమ్మారి తర్వాత ఎల్ఐసీ ఈ-చెల్లింపులు పెరిగాయి. డిజిటల్ మోడ్ రూపంలో ఎల్ఐసీ రూ. 60 వేల కోట్ల విలువైన ప్రీమియంలను సేకర్స్తోంది. ఎల్ఐసీ సుమారు 8 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదు చేసింది. రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.


Next Story

Most Viewed