పాలసీదారులకు LIC హెచ్చరిక..

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) తన పాలసీదారులను హెచ్చరించింది. ఎల్ఐసీ ఆధికారులు, ఏజెంట్లు, ఐఆర్‌డీఏఐ అధికారులు, నకిలీ ప్రయోజనాల ఆశలతో మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమ్మత్తంగా ఉండాలని ఎల్ఐసీ హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల టెలిమార్కెటింగ్ మోసాల సంఘటనల దృష్ట్యా ఎల్ఐసీ పేరుతో మోసం చేసే వారి వలలో పడొద్దని సూచించింది. ఎవరైనా అలా ఫోన్ చేస్తే అలర్ట్‌గా ఉండాలని తెలిపింది. ఎల్ఐసీ [&hellip;]</p>

పాలసీదారులకు LIC హెచ్చరిక..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) తన పాలసీదారులను హెచ్చరించింది. ఎల్ఐసీ ఆధికారులు, ఏజెంట్లు, ఐఆర్‌డీఏఐ అధికారులు, నకిలీ ప్రయోజనాల ఆశలతో మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమ్మత్తంగా ఉండాలని ఎల్ఐసీ హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల టెలిమార్కెటింగ్ మోసాల సంఘటనల దృష్ట్యా ఎల్ఐసీ పేరుతో మోసం చేసే వారి వలలో పడొద్దని సూచించింది.

ఎవరైనా అలా ఫోన్ చేస్తే అలర్ట్‌గా ఉండాలని తెలిపింది. ఎల్ఐసీ పాలసీలకు సంబంధించి బోనస్ ప్రయోజనాలు అందిస్తామని ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఈ మధ్య తెలిసిందని, ఎల్ఐసీ ఎప్పుడూ అలాంటి కాల్స్ చేయదని స్పష్టం చేసింది. పాలసీదారులు జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ఫోన్ కాల్స్ అందుకున్న వ్యక్తులు ఫోన్ నంబర్ వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎల్ఐసీ కోరింది. ఎల్ఐసీకి ఉన్న విస్తృతమైన మార్కెట్, పంపిణీ నేపథ్యంలో ఏదొక దశలో మోసం జరిగే ప్రమాదం ఉందని, దీన్ని అరికట్టేందుకు ఎల్ఐసీ వివిధ ప్రక్రియలను అమలు చేస్తోందని, డేటా నిర్వహణలో సరైన విధానాలను పటిష్టం చేసిందని వివరించింది. అయినప్పటికీ మోసం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాలసీదారులు జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని ఎల్ఐసీ పేర్కొంది.

Next Story