ఈటలను సస్పెండ్​ చేయండి.. మంత్రులు, ఎమ్మెల్యే లేఖ

by  |
Etala Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం వైస్​చైర్మన్​బోయినపల్లి వినోద్​కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​… పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. మంగళవారం వేర్వేరుగా ఈ లేఖలను పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే ఈటలపై విమర్శలు ఎక్కు పెట్టారు. మంత్రులతో పాటుగా వినోద్​కుమార్​వంటి నేతల నుంచి ఈటలకు ఎదురుదాడి మొదలైంది. అటు ఈటల కూడా విమర్శలకు దిగుతున్నారు. అయితే ఈటలకు మద్దతుగా ఎమ్మెల్యే రసమయి ఉంటాడని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. కారణాలేమైనా ఈటలను టీఆర్ఎస్​ పార్టీ నుంచి బహిష్కరించాలని, వెంటనే సస్పెండ్​ చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని పార్టీ చీఫ్​ కేసీఆర్​తో పాటుగా వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు కూడా లేఖను పంపించినట్లు తెలుస్తోంది.

ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేసినా ఇంకా పార్టీనుంచి సస్పెండ్​ చేసే అంశంలో క్లారిటీ లేదు. అటు రాజీనామాకు కూడా సిద్ధమని ఈటల ప్రకటించారు. పార్టీ గుర్తుపై కాకుండా సొంతంగా మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమేనంటూ సంకేతాలిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటలను పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్​ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు లేఖ రాయడం చర్చగా మారింది.


Next Story

Most Viewed