‘మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం’

by Shyam |

<p>దిశ, జనగామ : మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్ గుప్తా అన్నారు. బుధవారం జనగామ ఆవోపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వాసులకు అవసరమయ్యే మట్టి గణపతులను ఐవీఎఫ్ ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగిందన్నారు. ఈ విగ్రహాలను శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ రోడ్డు లోని వాస్తు గణపతి ఆలయం వద్ద ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. [&hellip;]</p>

‘మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం’
X

దిశ, జనగామ : మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్ గుప్తా అన్నారు. బుధవారం జనగామ ఆవోపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వాసులకు అవసరమయ్యే మట్టి గణపతులను ఐవీఎఫ్ ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగిందన్నారు.

ఈ విగ్రహాలను శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ రోడ్డు లోని వాస్తు గణపతి ఆలయం వద్ద ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కావున ప్రజలందరు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ గణపతులను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరి సంతోష్, రామిని శివుడు, తడకమల్లా నరసింహారావు, కందుకూరి కుమార్, గందె వేణు, నల్లా మధు తదితరులున్నారు.

Next Story