ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

by Shyam |

<p>దిశ, పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని కార్మిక వర్గానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ పిలుపు నిచ్చారు. కార్మిక చట్టాల సవరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సీఐటీయూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ&#8230; కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19ను అడ్డం పెట్టుకుని తన నయా ఉదారవాద విధానాలను అమలు చేసిందన్నారు. [&hellip;]</p>

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
X

దిశ, పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని కార్మిక వర్గానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ పిలుపు నిచ్చారు. కార్మిక చట్టాల సవరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సీఐటీయూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19ను అడ్డం పెట్టుకుని తన నయా ఉదారవాద విధానాలను అమలు చేసిందన్నారు.

దేశ సహజ వనరులు జాతి సంపద అయిన బొగ్గు, ఖనిజాలు, భూములు, విద్యుత్తు,రైల్వే, రక్షణ, విమానాశ్రయాలు, స్టీల్, అంతరిక్షం, అణు ఇంధన పరిశ్రమలతో సహా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ దేశ ప్రయోజనాలను బలిపెడుతుందోన్నారు.

Next Story