- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత చిక్కింది.. చింత తీరింది..
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులిని అధికారులు పట్టుకున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్, వెటర్నరీ విభాగం వైద్యులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. రాజేంద్రనగర్ వాలమ్తారి సమీపంలో చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం తెల్లవారు జామున సుమారు 5-6 ఏండ్ల వయస్సు గల మగ చిరుతపులి ఆ బోనులో చిక్కుకుంది . ఇదిలా ఉండగా బోనులో చిక్కకున్న చిరుతపులి ముఖం మీద రాపిడితో కూడిన […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులిని అధికారులు పట్టుకున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్, వెటర్నరీ విభాగం వైద్యులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. రాజేంద్రనగర్ వాలమ్తారి సమీపంలో చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం తెల్లవారు జామున సుమారు 5-6 ఏండ్ల వయస్సు గల మగ చిరుతపులి ఆ బోనులో చిక్కుకుంది . ఇదిలా ఉండగా బోనులో చిక్కకున్న చిరుతపులి ముఖం మీద రాపిడితో కూడిన గాయాలను అధికారులు గుర్తించారు. దీంతో చిరుతకు వైద్య చికిత్సలు అందజేశారు. ప్రస్తుతం చిరుత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు.
Next Story






